Suicide Crime: హైదరాబాద్ లోని పెట్రోల్ పంపు లో పనిచేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న పిప్పడిపల్లి(Pippadipally) గ్రామానికి చెందిన సిహెచ్ రాజు(CH Raju)కు సర్పంచ్ ఎన్నికలు ఆయన ప్రాణం మీదకు తెచ్చాయి. సోమవారం ఉదయం రాజు (35) శంషుద్దీన్ గ్రామ శివారు లోని అయ్యప్ప స్వాముల సన్నిదానానికి దగ్గరలో గల వ్యవసాయ పొలంలోని జీడీ చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు రాయికోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజకీయాలు తన వల్ల కావని..
పిప్పడుపల్లి గ్రామ సర్పంచి పదవికి నామినేషన్ వేసినాడు. గత 3,4 రోజుల నుండి ఒంటరిగా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు చేయడానికి ఎలా అంటూ ఆలోచించడం, గ్రామస్తులు గొంతెమ్మ కోరికలు కోరడంతో టెన్షన్ కు గురయ్యాడు. మృతుడి తల్లి పొలం కూడా అమ్ముకోమని చెప్పినట్లు సమాచారం. ఆదివారం రాత్రి నుండి తాను బ్రతకలేనని, ఈ రాజకీయాలు తన వల్ల కావని భయాన్ని వ్యక్తం చేయడంతో బంధు, మిత్రులు కలిసి స్థానిక ఆసుపత్రిలో కూడా చూపించినారు. ఆదివారం రాత్రి సంశిద్దిన్పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప స్వాముల సన్నిధానంలో పడుకున్నాడు.
Also Read: Kavitha: పంచాయతీ ఎన్నికల రోజూ ఏపీపీ పరీక్షనా? వాయిదా వేయాలని ఎక్స్‌లో కవిత డిమాండ్!
జీడి చెట్టుకి ఉరి
సన్నిధానంలోని తన తోటి స్వాములతో కూడా తన వల్ల కాదు దాని బతకలేను అని చెప్పి సోమవారం ఉదయం 5:30 గంటలకు సన్నిధానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రాజు కనిపించక పోయే సరికి ఇతర స్వాములు అందరూ కలిసి వెతకగా ఉదయం వ్యవసాయ పొలంలోని జీడి చెట్టుకి ఉరి వేసుకున్నది గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేసారు. తన భర్తకు మద్దతు సరిగ్గా లభించడలేదని ఓడిపోతానని మనస్థాపoతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Suryapet Police: సూర్యాపేటలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 12 లక్షల మోసం బట్టబయలు!

