Suryapet Police: నకిలీ బంగారం అమ్ముతున్న ముఠాను సూర్యాపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ (District SP Narasimha) తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా వివరాలను వెల్లడించారు. ఈనెల ఆరో తేదీన హనుమకొండకు చెందిన సూర్యనేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో నకిలీ బంగారానికి సంబంధించి మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం సూర్యాపేట రూరల్ పోలీసులు బాలెంల గ్రామ శివారు ఖమ్మం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ఇర్రి నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఆదినారాయణ, పల్నాడు జిల్లాకు చెందిన యోగి రెడ్డి, పిట్ట నాగిరెడ్డి లుగా గుర్తించారు.
అమ్మి పెడితే 10% కమిషన్
కేసు వివరాల్లోకి వెళితే… గత నెల 25వ తేదీన ఇర్రి నరేష్ సుధాకర్ కు ఫోన్ చేసి తనకు తెలిసిన నాగేశ్వరరావు వద్ద బంగారం ఉంది. ఆ బంగారం అతి తక్కువ ధరకు అమ్ముతాడు ఆ బంగారాన్ని మనం 90000లకు అమ్మి పెడితే కమిషన్ ఇస్తాడని తెలిపాడు. 27వ తేదీన సూర్యాపేట పట్టణంలోని హైటెక్ బస్టాండ్ వద్ద నరేష్, సుధాకర్ ఇద్దరు కలిశారు. సుధాకర్ తో పాటు శ్రీనివాసరావు, చంద్ర ఆదినారాయణ ను కూడా వచ్చారు. మీరంతా కలిసి బాలెంల లోని అరుణ టిఫిన్ సెంటర్ వెనక ఇంట్లో ఉంటున్న నాగేశ్వరరావు అలియాస్ రాజారాం వద్దకు వెళ్లారు. నాగేశ్వరరావు, అతని తమ్ముడు బాల ఇద్దరు నకిలీ బంగారం పిల్లలను చూపించారు. ఒక్కొక్కటి 20 గ్రాములు ఉన్న వాటిని అమ్మి పెడితే 10% కమిషన్ ఇస్తామని నరేష్ కు తెలిపారు.
Also Read: Suryapet Police: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. సదరు వ్యక్తి అరెస్ట్!
తక్కువ ధరకు బంగారం వస్తుంది
నరేష్ బంగారం అమ్మేందుకు ఒప్పుకొని కన్నయ్య అనే ఆటో డ్రైవర్ను వారికి పరిచయం చేసి బంగారం తక్కువ ధరకు ఉందని దానికి బిల్లులు ఉండవని తెలిపారు. అదే ఆటోలో ప్రయాణం చేస్తున్న హనుమకొండకు చెందిన వెంకటేశ్వరరావు. లీల లకు తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు. లీల తక్కువ ధరకు వస్తుందని ఆశపడి ఈనెల ఆరో తేదీన 7 హోటల్ వద్దకు రాగా ఆదినారాయణ శ్రీనివాసరావు యోగా రెడ్డి నాగిరెడ్డి చంద్ర లు వెంకటేశ్వరరావు వద్ద ఉన్న ఐదు లక్షలు, మామిడి లీల వద్ద ఉన్న 7 లక్షల రూపాయలు చూసి వారిని బాలేంల లోని నాగేశ్వరరావు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు తీసుకువచ్చారు. వారి నుంచి 12 లక్షల రూపాయలు తీసుకొని 20 గ్రాములు ఉన్న ఐదు బంగారం నకిలీ పిల్లలను ఇచ్చారు.
రూ. 12 లక్షలను స్వాధీనం
మాట్లాడుకున్న ప్రకారం మిగతా డబ్బులు చెల్లించిన తర్వాత మరో ఐదు బిల్లలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులకు తనిఖీలు చేస్తే దొరికిపోతామని ఉద్దేశంతో డబ్బును ఇర్రి నరేష్ వద్ద ఉంచాలని నాగేశ్వరరావు చెప్పాడు. నాగేశ్వరరావు నరేష్ కు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని బాలేం ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పడంతో వెంకటేశ్వరరావు మిగిలిన డబ్బు తీసుకొని వస్తే మిగిలిన ఐదు బిళ్ళలు ఇస్తామని డబ్బు తీసుకొని రమ్మని చెప్పాడు. నరేష్ కన్నయ్యకు అదే విషయం చెప్పడంతో కన్నయ్య వెంకటేశ్వరరావు రవి కారులో బాల్యంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న సూర్యపేట రూరల్ పోలీసులు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి ఐదు నకిలీ బంగారం బిల్లలు, రూ. 12 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

