Suryapet Police: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగొళ్ళపల్లి నివాసి మట్టె దేవేందర్ గత కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ గా పనిచేసాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఉద్యోగం మానేసాడు.
అయిన తను పాలేరు నియోజకవర్గం రిపోర్ట్ గా పనిచేస్తున్నట్టు కొందరిని నమ్మబలికిస్తూ అమాయకులను ఆసరా చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ వచ్చాడు. అలా ఖమ్మం జిల్లాతో పాటు సూర్యపేట జిల్లాకు చెందిన కొంతమంది నిరుద్యోగులకు 2023 సంవత్సరంలో ఉపేందర్, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులతో పాటు అటెండర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ చెప్పాడు.
Also read: Road Accident: తండ్రికి గిఫ్ట్ అంటూ వెళ్లిన కూతురు.. చివరికి ఏమైందంటే!
గత ప్రభుత్వ హయాంలో తనకు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల తో సంబంధాలు ఉన్నాయని వారితో దిగిన ఫొటోస్ చూపించి బాధితుల వద్ద నుంచి సుమారు లక్షలాది రూపాయలు వసూలు చేసాడు. సంవత్సరాలు గడుస్తున్నా కానీ, బాధితులకు ఉద్యోగాలు ఇప్పించకపోవడమే కాకుండా బెదిరింపులకు గురి చేయటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సూర్యాపేట జిల్లా పోలీసులను ఆశ్రయించడం జరిగింది.
17మంది వద్ద నుండి రూ.14లక్షలు వసూళ్ళు చేసినట్లు బాధితులు ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. దీంతో నకిలీ రిపోర్టర్ మట్టే దేవేందర్ ను సూర్యాపేట వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసారు.