Telangana Holidays 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి (Telangana Holidays 2026) సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవులు (General Holidays), ఐచ్ఛిక సెలవులను (Optional Holidays) జాబితాను సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక జీవోను జారీ చేసింది. ఏడాది మొత్తంలో 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులు వచ్చాయి. ఆదివారాలు, ప్రతి నెలా రెండవ శనివారాలలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి ఉంటాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సెలవులు ఆదివారం రోజున వచ్చినా కూడా, ఆ రోజును సాధారణ సెలవుగా పరిగణిస్తామని తెలిపింది. ఇక, ఆప్షనల్ సెలవుల విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ మతాన్ని, లేదా పండుగను పరిగణనలోకి తీసుకోకుండానే ఐదు ఆప్షనల్ సెలవులు తీసుకొచ్చని వివరించింది. అయితే, ఆప్షనల్ సెలవులు ఉపయోగించుకోవడానికి ఉద్యోగులు ముందుగా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also- Starlink Monthly Plan: ‘స్టార్‌లింక్’ కనెక్షన్ రేట్లు వచ్చేశాయ్.. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?
అయితే, సెలవులకు సంబంధించి ఇండస్ట్రియల్‌కు సంబంధించిన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని పబ్లిక్ అండర్‌టేకింగ్‌లు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్లలో పనిచేసే కార్మికులు, రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఇవే సెలవులు (ipso-facto) వర్తించబోవని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ సంస్థలు సెలవులు పాటించే పండుగలు, సందర్భాలకు సంబంధించి సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్లు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేస్తాయని వివరించింది. ఇక, ముస్లిం పండుగల తేదీల్లో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. తేదీల్లో ఏవైనా మార్పులు సంభవిస్తే, ఆ సమాచారం మీడియా ద్వారా ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు సచివాలయంలోని అన్ని విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదివారం నాడు మూడు పెద్ద పండుగలు
2026లో మొత్తం 27 సాధారణ సెలవులు రాగా, అందులో 3 పెద్ద పండుగలు ఆదివారం నాడు వచ్చాయి. ఆ జాబితాల మహాశివరాత్రి, సద్దుల బతుకమ్మ, దీపావళి ఉన్నాయి.
పండుగలు, తేదీలు ఇవే
1. భోగి – జనవరి 14 (బుధవారం)
2. సంక్రాంతి – జనవరి 15 (గురువారం)
3. గణతంత్ర దినోత్సవం – జనవరి 26 (సోమవారం)
4. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15 (ఆదివారం)
5. హోలీ – మార్చి 3 ( మంగళవారం)
6. ఉగాది – మార్చి 19 (గురువారం)
7. రంజాన్ – మార్చి 21 (శనివారం)
8. రంజాన్ మరుసటి రోజు – మార్చి 22 (ఆదివారం)
9. శ్రీ రామ నవమి – మార్చి 27 (శుక్రవారం)
10. గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 03 (శుక్రవారం)
11. బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 05 ( ఆదివారం)
12 డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14 ( మంగళవారం)
13. బక్రీద్ – మే 27 ( బుధవారం)
14. మొహర్రం – జూన్ 26 (శుక్రవారం).
15. బోనాలు – ఆగస్టు 10 (సోమవారం)
16. స్వాతంత్ర్య దినోత్సవం – ఆగస్టు 15 (శనివారం)
17. ఈద్ మిలాద్ ఉన్ నబి – ఆగస్టు 26 (బుధవారం)
18. శ్రీ కృష్ణాష్టమి – సెప్టెంబర్ 04 (శుక్రవారం)
19. వినాయక చవితి – సెప్టెంబర్ 14 (సోమవారం)
20. గాంధీ జయంతి – అక్టోబర్ 02 (శుక్రవారం).
21. సద్దుల బతుకమ్మ – అక్టోబర్ 18 (ఆదివారం).
22. విజయ దశమి / దసరా – అక్టోబర్ 20 (మంగళవారం).
23. విజయ దశమి మరుసటి రోజు అక్టోబర్ 21 (బుధవారం).
24. దీపావళి – నవంబర్ 08 (ఆదివారం).
25. కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి- నవంబర్ 24 (మంగళవారం).
26. క్రిస్మస్ – డిసెంబర్ 25 (శుక్రవారం).
27. క్రిస్మస్ మరుసటి రోజు (బాక్సింగ్ డే) – డిసెంబర్ 26 (శనివారం).
Telangana’s 2026 holiday list is out!
9 long weekends… &
6 more if u plan smart by applying leaves on Monday or FridayBut Bathukamma & Diwali on Sunday pic.twitter.com/H5czfICIsN
— Naveena (@TheNaveena) December 8, 2025

