Kishan Reddy: హైదరాబాద్ కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ లోప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్.. ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాసూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా వర్ధిల్లుతోందన్నారు. ఈ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
Also Read: Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
ఈ కల సాకారమవుతుంది
2047 నాటికి దేశం వికసిత భారత్‌గా వెలుగొందాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, అయితే రాష్ట్రాల కీలక సహకారంతోనే ఈ కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పరిశ్రమలను, స్టార్టప్స్ ను, టాలెంట్ ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉందని, త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: Kishan Reddy: హైదరాబాద్ సంస్థానానికి ఆయన కంటే గొప్ప చేసిందెవరు లేరు: కిషన్ రెడ్డి

