Kishan Reddy: తెలంగాణకు, హైదరాబాద్ సంస్థానానికి సర్దార్ పటేల్ కంటే గొప్ప సేవ చేసిన నాయకుడు మరొకరు లేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. సికింద్రాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన యూనిటీ మార్చ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు తమ హృదయాల్లో నిలుపుకోవాల్సిన వారిలో మొదటి వరుసలో నిలిచే వ్యక్తి భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేలేనని కొనియాడారు. ఆ రోజుల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రజాకార్లు సాగించిన హత్యాకాండ, వేలాది మంది హిందువులపై జరిగిన దారుణాలు, మహిళలపై జరిగిన అమానవీయ వేధింపులు చరిత్రకు తెలిసిన వాస్తవమని, ఆ దుస్థితి నుంచి విముక్తి చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Also Read: Mandhana Wedding: సంగీత్‌లో రొమాంటిక్ డ్యాన్స్‌తో అదరగొడుతున్న స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్..
దేశ నిర్మాణంలో..
ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో ఐక్యం చేసి, మన తెలంగాణ(Telangana)కు నిజమైన స్వేచ్ఛను అందించిన నాయకుడు ఆయనేనని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కూడా సర్దార్ పటేల్ అపూర్వమైన పాత్ర పోషించారన్నారు. స్వాతంత్ర్యం అనంతరం చిన్న చిన్న సంస్థానాలను, వందలాది రాజ్యాలను ఒకే భారతదేశంగా ఐక్యం చేసిన నాయకత్వం సర్దార్ పటేల్‌దేనన్నారు. సాంస్కృతికంగా, ధార్మికంగా, భౌగోళికంగా ఎన్నో భిన్నత్వాలు ఉన్న దేశాన్ని ఐక్య భారతంగా తీర్చిదిద్దిన మహానుభావుడు అని కొనియాడారు. అందుకే పటేల్ 150వ జయంతిని తెలంగాణలోని ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
Also Read: Gulf flight diverted: హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం
