Gulf flight diverted: బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందని మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని దారి మళ్లీంచారు.
Also Read: Vanajeevi Ramaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత.. వనజీవి రామయ్య బయోపిక్ చిత్రం చిత్రీకరణ
మొత్తం 154 మంది ప్రయాణికులు
బహ్రెయిన్ (Bahrain) నుంచి హైదరాబాద్ (Hyderabad)కి రావలసిన విమానాన్ని ముంబై (Mumbai)కి దారి మళ్లీంచారు. ముంబైలో విమానం లాండ్ చేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చి చెప్పారు. అంతా పరిశీలించిన అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. విమానం ప్రయాణించే సమయంలో అందులో మొత్తం 154 మంది ప్రయాణికులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
