Vanajeevi Ramaiah: వనజీవి రామయ్య అంటేనే వనాలకు ఎక్కడలేని సంబరాలు. ఎందుకంటే రోజురోజుకు తరిగిపోతున్న వనాలకు తోడు వనజీవి రామయ్య(Ramaiah) వనాలను నాటుతూ వాటిని సంరక్షిస్తూ నిత్య కృత్యంగా చెట్ల కోసమే ఆయన జీవితాన్ని ధారపోశారు. అందుకే వనజీవి రామయ్య అంటే వనాలకు ఎనలేని సంబరం. ప్రస్తుతం వనజీవి రామయ్య వనాలను నాటక పోయిన ఎప్పటినుంచో నాటిన మొక్కల రూపంలో వనజీవి రామయ్య చిరకాలం నిలిచిపోతారు. వనజీవి రామయ్య ఘనతను ఎవరు కూడా చాటలేరు. ఆ మాత్రం చాటిన ఆ ఘనతను దాటలేరు. అది వనజీవి రామయ్య జీవిత చరిత్ర అందుకే ఆయన బయోపిక్ చిత్రాన్ని ప్రకృతి పరిరక్షణ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారంటేనే వనజీవి రామయ్య ఘనత ఏంటో ఇట్టే అర్థమయిపోతోంది. ఆయన వనాల కోసం తపించిన పరితపన పసిగట్టిన ప్రకృతి పరిరక్షణ ఫిలిమ్స్ బ్యానర్పై లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మాతగా నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహిస్తుండగా ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత విధ్వంసుడు బల్లెపల్లి మోహన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ వనజీవి రామయ్య పాత్రను పోషిస్తుండగా నటి నాగమణి అతని భార్య జానకమ్మ పాత్రను పోషిస్తున్నారు. వనజీవి రామయ్య తన జీవితకాలంలో దాదాపు కోటిన్నర మొక్కలను నాటి పద్మశ్రీ అవార్డు రూపంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని, వనజీవి రామయ్య చేసిన కృషిని హైలెట్ చేస్తూ భావితరాలకు స్ఫూర్తినివ్వడం కోసం ఈ సినిమా లక్ష్యంగా చేసుకొని నిర్మాణం చేస్తున్నారు. ఈ బయోపిక్ బహుభాష చిత్రం గా నిర్మించేందుకు చిత్ర యూనిట్ అంత కృషి చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ లతోపాటు మరో రెండు భాషల్లోనూ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు.
దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య
వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేశారు. పర్యావరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా, జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం జీవితం ఆసాంతం అంకితం చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా ఆయన జీవిత కథ పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాలలోనూ చేర్చారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలనుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మన తెలంగాణ బిడ్డ వనజీవి రామయ్య ముందు వరుసలో ఉంటారు. తన జీవితాంతం మొక్కలు నాటేందుకు ధార పోసిన ప్రకృతి ప్రేమికుడు. చెట్ల నాటడం, నాటిన మొక్కలను అలుపెరుగకుండా సంరక్షించడంతో వనజీవి రామయ్య కు ప్రకృతి ప్రేమికుడు అనే బిరుదు అంది వచ్చింది. సమాజ హితం కోసం, భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సద్భావన కలిగిన మహోన్నత వ్యక్తి వనజీవి రామయ్య. ఒక్కడే కోటిన్నర మొక్కలకు పైగా నాటి ప్రపంచంలోనే ఓ గొప్ప చరిత్రను సృష్టించాడు. కోటిన్నర మొక్కలకు పైగా నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: Seethakka: సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రండి.. రాష్ట్రపతిని ఆహ్వానించిన మంత్ర సీతక్క!
2005 సంవత్సరంలో వనమిత్ర అవార్డు
కోటిన్నర మొక్కలు నాటిన వనజీవి రామయ్యకు పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు లభించింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు దక్కింది. 2017లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠశాలల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి ఆయన ఘనతను చాటింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో వనజీవి రామయ్య జీవితం పాఠ్యాంశంగా ప్రస్తుతం బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో మన జీవి కృషిని పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధనలు చేస్తున్నారు.
చిత్రీకరణ ప్రదేశాలు
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య బయోపిక్ చిత్రీకరణ ఉమ్మడి ఖమ్మం, వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో, హైదరాబాదులోని ఈకో పార్క్, కె.వి.ఆర్.హెచ్ పార్క్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. వనజీవి రామయ్య చిన్ననాటి దృశ్యాలు చరియల్లోని ఒక ఇల్లు వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణ డిసెంబర్ 17 నాటికి ముగుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా నిర్మాణం జరుగుతోంది.
Also Read: Manchu Manoj: మంచు మనోజ్ మరో కొత్త ప్రయాణం ‘మోహన రాగ’ మ్యూజిక్ లేబుల్.. నాన్నకు ప్రేమతో!
