Seethakka: సమ్మక్క సారల‌మ్మ మ‌హా జాత‌ర‌కు రండి
Seethakka ( image credit: twitter)
Telangana News

Seethakka: సమ్మక్క సారల‌మ్మ మ‌హా జాత‌ర‌కు రండి.. రాష్ట్రపతిని ఆహ్వానించిన మంత్ర సీతక్క!

Seethakka: సమ్మక్క, సారల‌మ్మ మ‌హా జాతరకు విచ్చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సీత‌క్క  (Seethakka) ఆహ్వానం ప‌లికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాత‌ర‌కు రావాల‌ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం, ఆదివాసీ సమాజం తరఫున ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.  బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భార‌తీయ కళా మహోత్సవ్‌ 2025 జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం త‌రఫున మంత్రి సీత‌క్క పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యాం

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ కళా, వంటకాల, ప్రజా సంప్రదాయాల వైభవాన్ని ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి అందిస్తున్న ఈ మహోత్సవం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భారత ఆత్మను ప్రతిఫలిస్తుందన్నారు. తెలంగాణ నేలపై జరుగుతున్న ఈ వేడుక దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే వేదికపై తీసుకొస్తుందన్నారు. హైదరాబాద్‌ను ‘మినీ ఇండియా’గా పిలుస్తార‌ని, ఇక్కడి ‘గంగా జమునా’ సంస్కృతి భారతీయ సమన్వయానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సంపద‌లైన ఒగ్గు కథ, పేరిణి శివతాండవం, బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతర వంటి గొప్ప సంప్రదాయాలను మంత్రి ప్రస్తావించారు. కూచిపూడి, భారతనాట్యం వంటి శాస్త్రీయ కళలతోపాటు గిరిజన, ప్రజా కళలకు తెలంగాణ ఇచ్చే గౌరవాన్ని వివరించారు.

Also ReadSeethakka: ప్రతి మహిళకు బొట్టుపెట్టి ఇందిరమ్మ చీర ఇవ్వాలి.. ఆఫీసర్లకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

ములుగుకు నిధులు కేటాయించండి

ఆదివాసీ జ‌నాభా అధికంగా ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ధి ప‌నులు, ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టుల‌కు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల‌ని కోరుతూ కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు మంత్రి సీత‌క్క విన‌తి ప‌త్రం అంద‌జేశారు. మ‌ల్లూరు దేవ‌స్థానం అభివృద్ధికి రూ.30 కోట్లు, బొగ‌త వాట‌ర్ ఫాల్స్ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు, జంప‌న్న వాగు డెవలప్​మెంట్‌కు రూ.50 కోట్లు కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Also Read: Minister Seethakka: నెదర్లాండ్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు తెలిపిన మంత్రి సీతక్క

Just In

01

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్

Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్‌.. అనసూయ షాకింగ్ పోస్ట్!