Jogipet News: మంజీరకు ఇరువైపులా ఫిఫ్త్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలి
Jogipet News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ, మెదక్

Jogipet News: మంజీరకు ఇరువైపులా ఫిఫ్త్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని.. కేంద్ర మంత్రులకు వినతి..!

Jogipet News: మంజీర నదికి ఇరువైపులా ఫిఫ్త్‌ ఫ్యూచర్‌ సిటీ కారిడార్‌(Fifth Future City Corridor) ఏర్పాటు చేయాలని అందోలు నియోజకవర్గ అఖిల పక్ష నాయకులు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగా జోగినాథ్(Ganga Joginath), రాష్ట్ర మాజీ కార్పోరేషన్‌ చైర్మన్‌ మఠం బిక్షపతి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ మల్లిఖార్జున్, మాజీ ఎంపీపీ రామాగౌడ్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మంగళవారం జోగిపేట(Jogipeta)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Also Read: Bigg Boss9 Telugu: చివరి రోజుల్లో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’.. ఈ ఫన్ మామూలుగా లేదుగా..

ఈ విషయమై వినతిపత్ర

ఎన్‌ హెచ్‌ 161 కలుపుతూ మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న వందలాది ఎకరాల భూమిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఐటిసిటీ(ITCT) కారిడార్లను ఫ్యూచర్‌ సిటీకి ప్లాన్‌ చేయాలని ఆయన కోరారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్‌(Minister Bandi Sanjay)ను కలిసి ఈ విషయమై వినతిపత్రాన్ని కూడా సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం నుంచే ట్రిపుల్‌ ఆర్‌(RRR) రోడ్డు నిర్మాణం జరుగుతున్నందున ఐటీ ఫ్యూచర్‌ సిటీకి ఇంకా ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర మంత్రులైన అమిత్‌ షా(Amit Shah), పీయూష్‌ గోయల్(Piyush Goyal), అశ్విన్‌ వైష్ణవ్‌(Ashwin Vaishnaw), కిషన్‌ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌ రావు(MP Raghunandan Rao) లకు వినతి పత్రాలు అందజేశామన్నారు. సీఎంఓ కార్యాలయం, మంత్రి శ్రీధర్‌ బాబు(Minister Sridhar Babu) లకు వినతి పత్రాలు అందజేశామన్నారు, దీనివల్ల ఇక్కడి ప్రాంత ప్రజలకు లక్షల మందికి ఉద్యోగ అవకాశా లభిస్తాయన్నారు. అలాగే భూములకు విలువ మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ నాయకుడు ప్రభాకర్‌ గౌడ్, రుద్రారం మాణయ్య, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ పైసల్, నాయకులు డి.గణేష్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Also Read: Bhumana Karunakar Reddy: శ్రీవారికి చంద్రబాబు ద్రోహం.. రూ.3 వేల కోట్లు దోచిపెట్టారు.. టీటీడీ మాజీ చైర్మన్

Just In

01

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Purushaha: కన్నీళ్లతో చంపేస్తా.. పవన్ కళ్యాణ్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ లుక్ విడుదల

Shocking Crime: అమెరికాలో తండ్రిని చంపిన భారత సంతతి యువకుడు.. ఇదే అసలైన ట్విస్ట్!

Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు

Jogipet News: మంజీరకు ఇరువైపులా ఫిఫ్త్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని.. కేంద్ర మంత్రులకు వినతి..!