Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల
Etela Rajender (imagecredit:swetcha)
Uncategorized

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Etela Rajender: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వర్గంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల వెల్లడైన తొలి దఫా సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై బండి వర్గీయులు వాట్సాప్ ద్వారా చేసిన ప్రచారంపై ఆయన స్పందించారు. కమలాపూర్‌లో తన నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నానని, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేనంటూ చురకలంటించారు. అవగాహన లేని పిచ్చోళ్లు అలాంటి పోస్టులు పెడతారంటూ విమర్శించారు.

Also Read: Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజుకు అనీల్ రావిపూడి ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది.. మీరూ చూసేయండి..

ప్రజలన్నీ గమనిస్తున్నారు

రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఆ పోస్టుల గురించి సమయం వచ్చినప్పుడు పార్టీనే తేలుస్తుందని స్పష్టం చేశారు. ఎవరేం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతున్నదని, వారి సంగతి వారే తేలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తొలి దఫా సర్పంచ్ ఫలితాల్లో ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్థిపై సంజయ్ బలపర్చిన అభ్యర్థి గెలిచారని ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రకటన విడుదల చేయడం వివాదానికి కారణమైంది.

Also Read: Akhilesh Yadav: ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?