VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఎంపీలు మౌనమేల!
VH Hanumantha Rao (imagecredit:twitter)
Uncategorized

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

VH Hanumantha Rao: జనగణనలో కులగణన చేపట్టాలని, ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రధాని మోదీ(Modhi)ని కోరామని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హనుమంతరావు(VH Hanumantha Rao) తెలిపారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన పాదయాత్రలో ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనార్టీ, బీసీ(BC)ల సమస్యలను తెలుసుకున్నారని, జనగణనలో కుల వారిగా లెక్కలు తెలుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జనాభాలో 56% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని, అనేక ఏళ్ల నుంచి ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ వాటిని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Also Read: DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

తెలంగాణ బీజేపీ నేతలను..

వెనుకబడిన కులాలకు 10% రిజర్వేషన్లు మోదీ ఇచ్చారని, అప్పుడు ఓబీసీ(OBC)లు ఏం మాట్లాడలేదని అన్నారు. అలాగే, బాపూజీ రోజ్ గార్ యోజన పేరును ప్రధాని మోదీ మన్ రేగాగా మార్చారని విమర్శించారు. ఓబీసీలలో బీజేపీ ఎంపీలు ఎంతోమంది ఉన్నారని, అయినా వారు ఈ సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి గెలిచి కూడా ఏం చేయడం లేదని మోదీ ఇటీవల అన్నారని గుర్తుచేశారు. కులగణన, ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమను ప్రధాని దగ్గరకు తీసుకెళ్తే, తామంతా కలిసి వస్తామని ఆయన ప్రకటించారు. బీజేపీ ఎంపీలు అందరూ తమను తీసుకెళ్ళి, ఓబీసీలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read: DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం