India victory: భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. హోబార్ట్‌లోని బెల్లిరైవ్ ఓవల్ మైదానం వేదికగా జరిగిన 3వ టీ20లో ఆతిథ్య ఆసీస్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే టీమిండియా సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లో 49 పరుగులు బాది భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోన్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
మిగతా భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17, జితేష్ శర్మ 22 (నాటౌట్), వాషింగ్టన్ సుందర్ 49 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చినప్పటికీ, మూడు కీలకమైన వికెట్లు తీసిన భారత పేసర్ అర్షదీప్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది.
Read Also- Womens World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. 38 బంతుల్లో 74 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మార్కస్ స్టోయినీస్ కూడా అదరగొట్టాడు. 39 బంతులు ఎదుర్కొని 64 రన్స్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
మిగతా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 6, మిచెల్ మార్ష్ 11, జాష్ ఇంగ్లిష్ 1, మిచెల్ ఒవెన్ 0, మ్యాథ్యూ షార్ట్ 26 (నాటౌట్), జావియర్ బార్లెట్ 3 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
Read Also- Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు
