World Cup Fianal: ఉమెన్స్ వరల్డ్ కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో (World Cup Fianal) భారత్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన అమ్మాయిలు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, మిడిలార్డర్ బ్యాట్స్‌ఉమెన్ దీప్తి శర్మ చక్కగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో, ప్రత్యర్థి దక్షిణాఫ్రికా లక్ష్యం 299 పరుగులుగా ఖరారైంది.
బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏకంగా 104 పరుగులు జోడించారు. మంధాన 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్ అయింది. షెఫాలీ వర్మ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాట్స్‌ఉమెన్స్ విషయానికి వస్తే, దీప్తి శర్మ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది. 58 బంతులు ఎదుర్కొని 58 పరుగులు సాధించింది. ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక, జెమీమా రోడ్రిగ్స్ 24 పరుగులు, కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ 20 రన్స్, రిచా ఘోష్ 34, రాధా యాదవ్ 3 (నాటౌట్) చొప్పున ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాక కీలకమైన 3 వికెట్లు పడగొట్టింది. మ్లాబా, క్లెర్క్, ట్రయాన్ తలో వికెట్ తీశారు. మరో వికెట్ (దీప్తి శర్మ) రనౌట్ రూపంలో దక్కింది.
చివరిలో రిచా ఘోష్ మెరుపులు మెరిపించడం స్కోర్ 298కి చేరడానికి దోహదపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన 298 పరుగుల స్కోర్.. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇది రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది. అంతకుముందు 2022లో ఇంగ్లండ్‌పై ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏకంగా 356 పరుగుల స్కోర్ సాధించింది.
రిచా ఘోష్ రికార్డ్
ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న రిచా 34 పరుగులు బాదింది. ఆమె ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఒక ఉమెన్స్ వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఉమెన్ క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆమె మొత్తం 12 సిక్సర్లు కొట్టింది. మెన్స్ క్రికెట్ విషయానికి వస్తే, ఈ రికార్డ్ రోహిత్ శర్మ పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఏకంగా 31 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.
Read Also- Womens World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Shafali Verma – 87 (78)
Deepti Sharma – 58 (58)
Smriti Mandhana – 45 (58)
Richa Ghosh – 34 (24)A complete team effort as India post 298/7 in the Women’s World Cup Final against South Africa! #CWC25Final #INDvSA #TeamIndia #BleedBlue #INDWvsSAW pic.twitter.com/9EQVBPnQn9
— Arshit Yadav (@imArshit) November 2, 2025
