Ind Vs Pak Toss: ఆసియా కప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న లీగ్ దశ మ్యాచ్‌లో టాస్ (Ind Vs Pak Toss) పడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు.
సూర్యకుమార్ యాదవ్ స్పందన..
‘‘మేము ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా అదే జరిగింది కాబట్టి సంతోషంగా ఉంది. మేము ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాం. పిచ్ చాలా బాగుంది. రాత్రి సమయంలో బ్యాటింగ్ చేయడానికి పరిస్థితులు ఇంకాస్త అనుకూలంగా ఉంటాయి. చాలా తేమ (హ్యూమిడిటీ) ఉంది. కొంత డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం’’ అని సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు.
Read Also- Ind vs Pak Match: దుబాయ్ స్టేడియానికి హై సెక్యూరిటీ.. ఫ్యాన్స్‌కు అనూహ్య రూల్స్!
సల్మాన్ ఆఘా స్పందన
‘‘మేము ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నాం. మేము చక్కగా రాణిస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాం. పిచ్ స్లోగా కనిపిస్తోంది. ముందుగా బ్యాట్ చేసి మంచి స్కోరు చేయాలనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడబోతున్నాం. మేము ఇక్కడే సుమారు 20 రోజులుగా ఉంటున్నాం. కాబట్టి ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డాం’’ అని సల్మాన్ ఆఘా చెప్పాడు.
Read Also- Ind vs Pak Match: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నిరసనకు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లు!
తుది జట్లు ఇవే
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ సాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ అఫ్రిదీ, సుఫియాన్ ముఖీం, అబ్రార్ అహ్మద్.