Illegal Construction: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబరు 334లో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డును మున్సిపాలిటీ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతుల్లేకుండా అక్రమ నిర్మాణాలు(Illegal structures) జరుగుతున్నాయని, 7వ వార్డు సాయినగర్ కాలనీలో 334 సర్వే నెంబరులో ఫంక్షన్ హాల్ నిర్మాణంలో భాగంగా అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ‘స్వేచ్ఛ’ వెలుగులోకి తీసుకొని వచ్చింది. ఇందుకు స్పందించిన మున్సిపాలిటీ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
హైడ్రా పేరుతో చర్యలు
తుంకుట మున్సిపల్ పరిధిలో జోరుగా అనుమతులు లేని నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులకు మాత్రం కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు తావు లేదని, అక్రమ నిర్మాణాలు గానీ, కబ్జాలు గాని చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కబ్జాదారులు జంకుతలేరు. అక్రమ నిర్మాణాలు, నాళాల కబ్జాలు, భూ కబ్జాల పై ప్రభుత్వం హైడ్రా(Hydraa) పేరుతో చర్యలు తీసుకున్న అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అక్రమ నిర్మాణాలకు చేస్తున్న, కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నా భయపడటం మాత్రం లేదు.
Also Read: Black Jaggery: అధికారుల సహకారంతో జోరుగా నల్ల బెల్లం దందా.. ఎక్కడంటే..?
మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్
తూముకుంట మున్సిపల్(Thumukunta Municipal) పరిధిలోని 7వ వార్డులో గల సర్వే నెంబర్ 334 లోని సాయి నగర్ కాలనీలో (ల్యాండ్ మార్క్) వైట్ హౌస్ పక్కన అక్రమ నిర్మాణం జరుగుతుందని తుంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్(Yedhu Nagesh) తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నోముల మధుసూధనరెడ్డి(Nomula Madhusudhana Reddy), నోముల సులోచన రెడ్డి ఫంక్షన్ హాల్(Nomula Sulochana Reddy Function Hall) నిర్మాణం చేపడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా నోటీసులు ఇచ్చామని పరోక్షంగా అక్రమ నిర్మాణాలను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామని మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపై వివరణ కోరేందుకు తూముకుంట మున్సిపల్ అధికారులను సంప్రదించగా అధికారులు స్పందించారు.
Also Read: Yashaswini Reddy: గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ