Yashaswini Reddy 9 IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Yashaswini Reddy: గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన పోస్టర్‌ ఆవిష్కరణ

Yashaswini Reddy: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, (Yashaswini Reddy) టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి సంయుక్తంగా గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.గ్లోబల్ గాంధీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుండి 13 వరకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరగబోయే మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సు & స్వదేశీ మేళాకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సి రాజేందర్ రెడ్డి లను ఫెడరేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు.

 Also Read: Dornakal Politics: డోర్నకల్‌లో రగులుతున్న రాజకీయం.. స్ధానిక పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…

మహాత్మా గాంధీ(Mahatma Gandhi) చూపిన అహింసా మార్గం, సత్యం, సమానత్వం ఈనాటి సమాజానికి అత్యంత అవసరం. కొత్త తరానికి ఆయన ఆలోచనలు, జీవన విధానం చేరేలా చేసే ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలుస్తుంది. అక్టోబర్‌లో జరగబోయే ఈ జాతీయ సదస్సు విజయవంతం కావడానికి అందరం కృషి చేయాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్లోబల్ గాంధీ ఫెడరేషన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 Also Read: POWERGRID Recruitment 2025: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలు..

Just In

01

Election Commission: జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఓటు వేయాలంటే అది తప్పనిసరి.. ఈసీ కీలక ఆదేశాలు

India vs Australia: నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోర్.. గెలుస్తారో, లేదో?

Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?

KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jaundice: జాండీస్‌ ఎందుకు వస్తుంది? షాకింగ్ నిజాలు చెప్పిన వైద్యులు