Governor Jishnu Dev Varma: ప్రాణం విలువైందని ప్రతీ ఒక్కరికి భద్రత ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) అన్నారు. ట్రాఫిక్ అంటే కేవలం రద్ధీ ఒక్కటే కాదని చెప్పారు. ప్రాణాలను రక్షించటం, జీవన ప్రమాణాలను పెంచటం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కల్పించటమన్నారు. దీని కోసం పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. హెచ్సీఎస్సీ, హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ట్రాఫిక్ సమ్మిట్ ను ప్రారంభించిన గవర్నర్ ప్రసంగించారు.
Also Read: Ministers Seethakka: పిల్లలకు సురక్షిత నగరంగా హైదరాబాద్: మంత్రి సీతక్క
రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
విద్యా సంస్థలకు వెళ్లే చిన్నారులు…అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారు హాస్పిటళ్లకు సురక్షితంగా చేరేలా చూడాలన్నారు. వాహనదారులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రయాణించే పరిస్థితులు కల్పించాలని చెప్పారు. రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కమిషనర్ సీ.వీ.ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ లో 92 లక్షల వాహనాలు ఉన్నట్టు చెప్పారు. ప్రతీ రోజూ అదనంగా 1500 వాహనాలు రోడ్ల మీదకు వస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించటంతోపాటు రోడ్డు భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అక్రమ పార్కింగులు, నిర్మాణాలను తొలగించటానికి రిమూవల్ ఆఫ్ అబ్ స్ట్రక్టీవ్ పార్కింగ్, ఎన్ క్రోచ్ మెంట్స్ ను అమలు చేస్తున్నట్టు తెలిపారు.
టాలీవుడ్ హీ సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ గతంలో తాను బైక్ పై వెళుతూ ప్రమాదం
అడ్వాన్వ్ డ్ సిగ్నల్ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. డ్రోన్లు, హై రైజ్ కెమెరాల ద్వారా నిరంతరం ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూన్నట్టు తెలిపారు. టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ గతంలో తాను బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు హెల్మెట్ ధరించటంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ట్రాఫిక్ మార్షల్స్ అన్ సంగ్ హీరోలని కొనియాడారు. కార్యక్రమంలో హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nag Ashwin post: దీపికా పదుకోణె వ్యవహారంలో నాగ్ అశ్విన్ ఫోస్ట్ వైరల్.. అందుకు కర్మ తప్పదా?
ధాన్యం టెండర్లపై జ్యుడీషియరీ విచారణ జరపాలి.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ధాన్యం టెండర్లలో జరిగిన కుంభకోణంపై జ్యూడిషియరీ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో గురువారం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సతీష్ రెడ్డి ,పల్లె రవికుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ధాన్యం టెండర్ల కుంభకోణంపై డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేదన్నారు. డబ్బులను జప్తు చేయాలని జీఓ నంబర్ 15 విడుదల చేసిందన్నారు. కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఈఎండీజప్తు చేసే అవకాశం ఉందని, 380 కోట్లలో కేవలం 66 కోట్ల రూపాయలు మాత్రమే జప్తు చేశారన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వానికి 1210 కోట్ల నష్టం
టెండర్లలో జరిగిన అక్రమాలపై జప్తు చేయాలని క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకు క్యాబినెట్ కు ఫైల్ వెళ్ళిందన్నారు. టెండర్ విలువ కంటే 230 రూపాయలు ఎక్కువ వసూలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వానికి 1210 కోట్ల నష్టం జరిగిందన్నారు.కేంద్రియబంగడా, నాకప్ సంస్థలకు చెందిన ఈఎండీని మాత్రమే జప్తు చేసి, హిందూస్థాన్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టెండర్లలో మొత్తం 860కోట్ల దోపిడీ జరిగిందని, మొత్తంగా ప్రభుత్వానికి 2వేల కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. ధాన్యం టెండర్ల కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ధాన్యం టెండర్ల మొత్తం వ్యవహారంపై జ్యుడీషియరీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Also Read: Chimpanzee: జంతువుల్లో పచ్చితాగుబోతు చింపాంజీలే.. రోజూ మద్యం ఉండాల్సిందే.. భలే విచిత్రంగా ఉందే!