Nag-Ashwin(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Nag Ashwin post: దీపికా పదుకోణె వ్యవహారంలో నాగ్ అశ్విన్ ఫోస్ట్ వైరల్.. అందుకు కర్మ తప్పదా?

Nag Ashwin post: పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణెకు బై-బై అని మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసందే. ఈ విషయంతో ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఈ మధ్యలో దర్శకుడు నాగ్ అశ్విన్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. “జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు, కానీ తర్వాత ఏమి జరగాలో మీరు ఎంచుకోవచ్చు” అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ మెసేజ్, దీపికాను ఉద్దేశించినట్టు నెటిజన్లు అర్థం చేసుకుంటున్నారు.

Read also-Shabana Azmi: పుట్టింది స్టార్ కుటుంబంలో.. అయినా టీ అమ్మింది.. కట్ చేస్తే అయిదు జాతీయ అవార్డులు

నాగ్ అశ్విన్ పోస్ట్.. కౌంటరా?

ఈ అలజడి మధ్యలో, నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. ‘కల్కి’లో కృష్ణుడి ఐకానిక్ ఎంట్రీ సీన్‌ను రీ-షేర్ చేసి, క్యాప్షన్ రాశారు: “జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏమి జరగాలో మీరు ఎంచుకోవచ్చు.” ఈ పోస్ట్ కేవలం కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. లైక్స్, కామెంట్స్ పెద్ద ఎత్తున పోటెత్తాయి. నెటిజన్లు దీన్ని దీపికాకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్‌గా చూస్తున్నారు. “కర్మను ఎవరూ తప్పించుకోలేరు” అనే అర్థంతో, ఆమె ‘కల్కి’లో చేసిన పాత్ర (సుమతి)ను మార్చలేకపోవడం, కానీ సీక్వెల్‌లో ఎంపికలు ఉన్నాయని హింట్ ఇస్తున్నారట. కొందరు “దీపికా పారితోషికం అడిగి డ్రామా చేసింది, ఇప్పుడు కర్మ ఫలితం” అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు “నాగ్ అశ్విన్ సూక్‌బుల్ రెస్పాన్స్, డైరెక్ట్‌గా చెప్పకుండా పాఠం చెప్పాడు” అంటున్నారు. పోస్ట్‌కు 5 లక్షలకు పైగా లైక్స్, వేలాది షేర్లు వచ్చాయి. ట్విట్టర్‌లో #NagAshwinPost, #DeepikaOut వంటి టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండి, సినిమాపై ఫోకస్ చేసుకునే డైరెక్టర్. ‘మహానటి’, గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ‘కల్కి’తో జాతీయ స్థాయిలో స్టార్ అయ్యారు. ఈ పోస్ట్ ఉద్దేశపూర్వకమా? లేక సాధారణ ఫిలాసఫికల్ మెసేజా? ఇప్పటివరకు ఆయన నుంచి అధికారిక క్లారిటీ లేదు. కానీ, ఫ్యాన్స్ మధ్య ఊహాగానాలు ఆకాశాన్ని తాకాయి.

Read also-Sunitha Laxma Reddy: రాష్ట్రంలో కులాలకు అతీతంగా ఆడుకునే పండుగ బతుకమ్మ!

సోషల్ మీడియాలో ఈ విషయం మీద రెండు రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. దీపికా ఫ్యాన్స్ “అన్యాయం, ఆమె పాత్ర ఐకానిక్” అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ “బడ్జెట్ కోసం ఔట్, కొత్త ఫ్రెష్ ఫేస్ వస్తుంది” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఓ యూజర్ రాసిన పోస్ట్ వైరల్: “దీపికా ఔట్ అంటే కల్కి 2 మరింత పవర్‌ఫుల్ అవుతుంది. నాగ్ పోస్ట్ సూపర్ హింట్!” అంటూ. మరొకరు “పారితోషికం కోసం డ్రామా చేస్తే ఇలా జరుగుతుంది” అని కామెంట్ చేశారు. సీక్వెల్ గురించి మరిన్ని డీటెయిల్స్ లీక్ అవుతున్నాయి. ప్రభాస్ ద్వితీయ భాగంలో కీలక పాత్రల్లో రాణిస్తాడని, కొత్త హీరోయిన్ ఎవరో ఆశ్చర్యకరంగా ప్రకటిస్తారని అంటున్నారు. షూటింగ్ ఎప్పడు మొదలవుతుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

 

nag aswin (image :X)

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?