GHMC: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ(GHMC)ని గట్టెక్కించేందుకు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులపై పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సిటీలోని 30 సర్కిళ్లలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, మోడల్ మార్కెట్లలో ఖాళీగా ఉన్న, 25 ఏళ్ల నుంచి తిష్ట వేసి ఉన్న సుమారు 954 షాపులు, మలిగీలకు వేలం పాట టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
లీజు గడువు ముగిసిన, ఖాళీగా ఉన్న, 25 ఏళ్ల నుంచి ఒకే వ్యాపార ఆక్రమించుకుని ఉన్న షాపులు, మలిగీలకు మళ్లీ టెండర్ కమ్ వేలం ను నిర్వహించే ప్రతిపాదనను ఇటీవలే జరిగిన స్టాండింగ్ కమిటీకి అధికారులు ప్రతిపాదనలు సమర్పించగా, అందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో్ అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో చాలా షాపులు, మలిగీలకు సంబంధించి గత రెండు దశాబ్దాల క్రితం నిర్ణయించిన అద్దెలు,ఈఎండీలను ప్రస్తుతమున్న మార్కెట్ రేట్లకు అనుగుణంగా సవరించి అద్దెలు పెంచే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది.
Also Read: Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో రూ.45 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన.. డిప్యూటీ సీఎం
తాజాగా చేపట్టనున్న టెండర్ కమ్ వేలం పాటు ప్రక్రియలో అద్దె కాలాన్ని రెండేళ్లకు పరిమితం చేయాలని, ఏటా అయిదు శాతం అద్దెలు పెంచాలన్న నిబంధనలను కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎస్టేట్ విభాగానికి చెందిన అద్దెలను ఇప్పటి వరకు అధికారులు ఇష్టారాజ్యంగా వసూలు చేసుకునేవారు. కొందరు తన సొంత అవసరాల కోసం లక్షలాది రూపాలను వినియోగించుకున్న సందర్భాలు సైతం ఉండటంతో ఇకపై అద్దెలు నేరుగా జీహెచ్ఎంసీ ఖజానాకు వెళ్లేలా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది.
ఆక్రమణదారులకు నోటీసులు
జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని 30 సర్కిళ్లలోని 954 షాపులు, మిలిగీలలో ఎక్కువ శాతం చాలా కాలంగా ఒకే ఓనర్ ఆక్రమించినవి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అలాంటి ఓనర్లకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎవరి పేరిట షాపు, మలిగీ కేటాయించారో సదరు వ్యక్తిని తీసుకురావాలని, లేని పక్షంలో వారి వారసులు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించిన షాపు, మలిగీని ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించినట్లు సమాచారం. వీరిలో కొందరు వ్యాపారులు కనీసం నోటీసులు తీసుకునేందుకు కూడా ముందుకు రావటం లేదని తెల్సింది. ఇలాంటి వారికి జీహెచ్ఎంసీ కౌన్సెలింగ్ ఇచ్చి, తదుపరి గా చేపట్టనున్న టెండర్ కమ్ వేలంలో వారికి కూడా ఛాన్స్ ఇస్తామని నచ్చజెప్పినట్లు సమాచారం.
అధికారులకు తెలియకుండానే టెండర్లు
జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న జీహెచ్ఎంసీకి చెందిన ఆరు షాపులకు స్థానిక సర్కిల్ అధికారులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు సమాచారం లేకుండానే టెండర్స్ కమ్ వేలం ప్రక్రియలు నిర్వహించినట్లు సమాచారం. కనీసం ప్రధాన కార్యాలయంలోని ఎస్టేట్ విభాగం అదనపు కమిషనర్ కు నోట్ ఫైల్ కూడా సమర్పించకుండా ఆరు షాపులకు స్థానిక మున్సిపల్ అధికారులు టెండర్ కమ్ వేలం పాటను నిర్వహించి, షాపులు కేటాయించిన విషయం తెలియగానే అదనపు కమిషనర్ (ఎస్టేట్) ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానిక సర్కిల్ అధికారులతో ఆరా తీయగా, ఇటీవలే ఆరు షాపులకు టెండర్ కమ్ వేలం పాట ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించటంతో ప్రధాన కార్యాలయం ఎస్టేట్ విభాగం అధికారులు షాక్ కు గురయ్యారు.
Also Read: Kajal Aggarwal: ” నేను బతికే ఉన్నాను ” చంపేయకండి.. ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్