Jubilee Hills Bypoll: సీఎంకు మైనార్టీ ముఖ్య నేతలు హామీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills Bypoll) తమ మద్ధతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని మైనార్టీ ముఖ్య సంఘాల నేతలు బుధవారం హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ మైనార్టీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైనారిటీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు మైనార్టీ నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫహీం ఖురేషి, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, వివిధ మైనారిటీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Read Also- Commissioner Sudheer Babu: ప్రజలు కూడా యూనిఫాం లేని పోలీసులే.. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు
కాంగ్రెస్‌కు ఓడిపోతామనే భయం
అందుకే మైనార్టీకి మంత్రి పదవి అంటూ ప్రచారం
ఓట్ల కోసం ముస్లింలకు తాయిలాలు
బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయి: పాలమూరు ఎంపీ డీకే అరుణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి అంటూ వార్తలు వస్తున్నాయని, దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్‌కు ఓడిపోతామనే భయం పట్టుకున్నట్లుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీపై అనేక కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. ఓడిపోతున్నామనే భయంతోనే కాంగ్రెస్ మైనారిటీ వర్గాలకు మంత్రి పదవి అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ముస్లిలంకు అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారన్నారు. తాయిలాల్లో భాగంగానే అజారుద్దీన్ కు మంత్రి పదవి అంటూ ఆమె ఎద్దేవాచేశారు. ఉన్నపళంగా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.
Read Also- Hydra: రూ. 39 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా!
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు. 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. హిందువులంతా ఐక్యంగా బీజేపీకి ఓట్లేయాలని డీకే అరుణ కోరారు. ఎంత దోచుకోవాలి? ఎంత దాచుకోవాలన్నదే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. మూడేళ్లే ప్రభుత్వం ఉంటుందని, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలను జూబ్లీహిల్స్ ప్రజలు భగ్నం చేయాలని కోరారు. కాంగ్రెస్ నేతలకు తమతో ప్రచారానికి వచ్చ దమ్ముందా? అని డీకే అరుణ చాలెంజ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని డీకే అరుణ చురకలంటించారు.
