Telugu Indian Idol S4 Finale (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Telugu Indian Idol S4 Finale: తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4’ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే (Telugu Indian Idol S4 Finale) ఎపిసోడ్ గ్రాండ్‌గా జరిగినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ మాస్ ఫైనల్‌కు మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ముఖ్య అతిథిగా హాజరై, ప్రేక్షకులకు, ఫైనలిస్ట్‌లకు అదనపు ఉత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా రవితేజ ఒక యువ గాయకుడికి తన తదుపరి చిత్రంలో పాట పాడేందుకు ఏకంగా ఆఫర్‌ను ప్రకటించి, అతడి కలను నిజం చేసేందుకు మార్గం చూపారు.

Also Read- Deepika Padukone: దీపికాను ఇంకా ఇంకా అవమానిస్తున్నారెందుకు?

రవితేజ ఎంట్రీతో వైభవంగా ఫైనల్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ నడుమ, ఆహాలో ప్రసారం కానున్న ఈ ఫినాలే ఎపిసోడ్ (అక్టోబర్ 31, నవంబర్ 1)కు రవితేజ చేసిన ఎంట్రీ షోకే ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. న్యాయనిర్ణేతలు ఎస్. తమన్ (S Thaman), కార్తీక్‌ (Singer Karthik)లతో కలిసి రవితేజ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఫైనలిస్ట్‌లు తమ అత్యుత్తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఫైనలిస్ట్‌లు తమ పాటలతో ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఎంతగానో మెప్పించినప్పటికీ, ఒక యువ గాయకుడి ప్రదర్శన మాత్రం రవితేజను విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా, ఆ గాయకుడు ఎంచుకున్న పాటల ఎంపికకు రవితేజ ప్రత్యేకంగా హాట్సాఫ్’ చెప్పడం విశేషం. ఆ యువ గాయకుడి గళం, టాలెంట్ రవితేజను ఎంతగానో మెప్పించాయి. సందర్భానుసారంగా తనదైన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అలరించే రవితేజ, ఆ యువ గాయకుడిని ఉద్దేశిస్తూ.. ‘మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్?’ అని ప్రశ్నించడంతో పాటు థమన్‌కు కూడా ఆ కుర్రాడితో పాడించు అని సూచించారు. నా తదుపరి సినిమాలో నా కోసం ఒక పాట పాడాల్సిందే అంటూ రవితేజ ఇచ్చిన ఈ బంపరాఫర్‌తో ఆ యువ గాయకుడి ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?

సినిమా రంగంలోకి కొత్త గళం

రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఐడల్ వేదికపై అవకాశం దక్కించుకున్న ఈ యువ గాయకుడు రవితేజ తదుపరి చిత్రాలలో ఏ చిత్రంలో అవకాశం పొందుతాడో చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ షో ఎందుకు పెట్టారో.. అందుకు న్యాయం జరిగిందనేలా.. సినిమా రంగంలో ఆ యువ గాయకుడు అడుగు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఆ గాయకుడి కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావించవచ్చు. మొత్తంగా, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ మాస్ మహారాజా రవితేజ రాకతో కేవలం సంగీత పోటీగానే కాకుండా, ఒక యువ ప్రతిభావంతుడికి గొప్ప సినిమా అవకాశాన్ని అందించే వేదికగా నిలిచిందని చెప్పుకోవాలి. ఫైనల్‌గా విన్నర్‌ని అనౌన్స్ చేసే సమయంలో రవితేజ చెప్పిన మాటలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ