Jaanvi Ghattamaneni (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?

Jaanvi Ghattamaneni: సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని (Super Star Krishna) వారసత్వం తెలుగు సినీ పరిశ్రమలో ఎంత విశిష్టమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఘట్టమనేని లెగసీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా వెలుగులోకి రానున్నది జాన్వి ఘట్టమనేని (Jaanvi Ghattamaneni). ఆమె ఎవరో కాదు.. స్వయానా మహేష్‌కు మేనకోడలు, తన సోదరి మంజుల (Manjula) కుమార్తె. జాన్వి ఘట్టమనేని తన తాత సూపర్ స్టార్ కృష్ణ గ్రేస్, తన మామ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మాగ్నటిజం, తల్లి మంజుల ఘట్టమనేని ఆత్మీయతను తనలో కలుపుకుని గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది. జాన్వి ఘట్టమనేని క్లాసిక్ బ్యూటీ అనే విషయం ఇటీవల వెలుగుచూసిన ఆమె ఫొటోలు చెప్పకనే చెప్పాయి. జాన్వి ఫొటోలు సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. అంతా వెల్‌కమ్ చెప్పడం గమనించవచ్చు. అలాగే ఇండస్ట్రీ వర్గాలు కూడా టాలీవుడ్ తెరపై కనిపించే మరో బ్యూటీ రాబోతుందంటూ అభివర్ణిస్తున్నాయి.

Also Read- Nonstop Fun: బిగ్ బాస్ హౌస్‌లో నాన్ స్టాప్ ఫన్.. ఇమ్ము, సుమన్ ఇమిటేషన్‌కు మెంబర్స్ షాక్!

అదే నెంబర్ వన్ ఆయుధం

జాన్వి ఘట్టమనేని ఎటువంటి హడావుడి లేకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని ఫొటోలు, కొన్ని టెస్ట్ రీల్స్‌తోనే తన చార్మ్ ఏంటో చూపించింది. దర్శకులు ఆమె నటనను చూసి.. ‘మాటలకన్నా కళ్ళతోనే భావాలను చెప్పగల సహజ నటి’ అని వర్ణించడం విశేషం. సినిమా రంగంలోకి వచ్చే వారికి ప్రతిభతో పాటు క్రమశిక్షణ అవసరం. అదే తన నెంబర్ వన్ ఆయుధం అని చెబుతోంది జాన్వి. ఇంకా పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, గేమింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ సమాన ఆసక్తి చూపిస్తుంది. జిమ్‌లో ట్రైనింగ్‌తో మొదలై తన డే, నైట్ తన ఆర్ట్ కార్నర్‌లో ముగుస్తుంది. కొత్తగా సినీ రంగంలోకి వచ్చే వాళ్లు సాధారణంగా ఒకే యాక్ట్‌తో గుర్తింపు పొందుతారు. కానీ జాన్వి ఘట్టమనేని మాత్రం అందం, మాధుర్యం, ప్రతిభ, వారసత్వం.. ఈ నాలుగింటినీ కలగలిపిన ప్రత్యేక వ్యక్తిత్వం గలిగిన వ్యక్తిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.

Also Read- Malavika Mohanan: చిరు-బాబీ సినిమాలో.. క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ హీరోయిన్!

దశాబ్దంలో ఒక్కసారి దొరికే ఆర్టిస్ట్

జాన్వి సంప్రదాయ లుక్‌ నుంచి మోడరన్ గ్లామర్‌ వరకు సునాయాసంగా మెరిసిపోగలదని ఇప్పటికే నిరూపించుకుంది. ఇంకా సినిమా రిలీజ్‌ కాకముందే ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చేసింది. ఒక జ్యువెలరీ క్యాంపెయిన్ తర్వాత.. జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఆమెతో పని చేసిన వారు.. ‘దశాబ్దంలో ఒక్కసారి దొరికే ఆర్టిస్ట్, మాట్లాడకముందే స్క్రీన్‌ను ఆక్రమించే ప్రెజెన్స్’ అంటూ ప్రశంసలు కురిపించడం గమనార్హం. అందుకు తగినట్లుగా యాక్టింగ్ ట్రైనింగ్స్, డాన్స్ రిహార్సల్స్, ఫిట్‌నెస్ సెషన్‌లతో ఆమె షెడ్యూల్ ఉంటుంది. సినిమా కుటుంబంలో పుట్టినా, తనకు నటనపై ఉన్న ప్రేమ మాత్రం వారసత్వం కాదని.. సహజ స్వభావంతో వచ్చిందని జాన్వి తెలుపుతుంది. పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో కెమెరా ముందుకొచ్చిన జాన్వి.. తన సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆమె నటన, నృత్యం నేర్చుకుంటూ తన ప్రతిభను నైపుణ్యంగా మార్చుకుంది. తన కుమార్తె గురించి మంజుల ఏమన్నారో తెలుసా?.. ‘నన్ను అడ్డుకున్న వారే.. ఇప్పుడు నా కుమార్తె జాన్వి కోసం ప్రార్థిస్తున్నారు. జాన్వి చిరునవ్వు నా ప్రార్థనలకు సమాధానం’.. మంజుల మధుర క్షణాలను అనుభవిస్తున్నారు. ఇప్పటికే రమేష్ బాబు తనయుడు, తనయ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు జాన్వి ఘట్టమనేని.. వెండితెర ఎదురుచూస్తున్న మరో సరికొత్త స్టార్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం.. తన తల్లి సాధించలేనిది.. కుమార్తె సాధిస్తుందేమో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ