Malavika Mohanan: చిరు-బాబీ సినిమాలో.. మాళవిక ట్వీట్ వైరల్!
Malavika Mohanan on Mega158 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Malavika Mohanan: చిరు-బాబీ సినిమాలో.. క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ హీరోయిన్!

Malavika Mohanan: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాలంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర)తో మరోసారి చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో 158వది కావడంతో, దీనికి వర్కింగ్ టైటిల్‌గా ‘మెగా 158’ (Mega158)వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి, దీనికి సంబంధించిన ప్రతీ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే, ‘మెగా 158’లో చిరంజీవి సరసన హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) నటించబోతోందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య పెద్ద చర్చే నడుస్తుంది. ఆ చర్చలకు, ఊహాగానాలకు తెరదించుతూ నటి మాళవికా మోహనన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

స్క్రీన్ పంచుకోవాలని కోరుకుంటున్నా.. కానీ?

మాళవికా మోహనన్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘‘హాయ్ గైస్, బాబీ సార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘మెగా 158’లో నేను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నా కెరీర్‌లో ఐకానిక్ చిరంజీవి సర్‌తో స్క్రీన్ పంచుకోవాలని నేను కూడా ఎంతగానో కోరుకుంటున్నాను. కాకపోతే.. ప్రస్తుతానికి నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవం’’ అని మాళవికా మోహనన్ పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్‌తో ‘మెగా 158’లో నటించబోతున్నారంటూ వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది. చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడితో నటించడం తన కల అని చెబుతూనే, ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం తాను భాగం కావడం లేదని ఆమె సున్నితంగా ఖండించారు.

Also Read- Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

అసలు కథానాయిక ఎవరు?

మాళవిక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు ‘మెగా 158’ విషయంలో వినిపించింది. తాజా ఆమె ఇచ్చిన క్లారిటీతో, చిరంజీవి సరసన ‘మెగా 158’లో అసలు కథానాయిక ఎవరు? అనే ప్రశ్న మళ్లీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని, అందులో అనుష్క శెట్టి పేరు కూడా పరిశీలనలో ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరణతో, ‘మెగా 158’ పై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ అప్డేట్ కోసం మెగాభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం