Anu Emmanuel: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా, అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)కు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. అందం, అభినయం, ముఖ్యంగా గ్లామర్‌ను ప్రదర్శించే తెగువ ఉన్నప్పటికీ, ఆమెకు ఒక్క సరైన బిగ్ హిట్ పడలేదు. దీంతో చిన్న చితక హీరోలతో కూడా ఆమె నటించడానికి సిద్ధమైంది. అయినా కూడా హిట్ మాత్రం పడలేదు. దీంతో ఆమె.. తన కెరీర్‌లో కొంత గ్యాప్ తీసుకుని, ప్రస్తుతం తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.
Also Read- Aaryan Movie: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ విడుదల వాయిదా.. కారణం రవితేజ, ప్రభాసే!
రష్మికనే నమ్ముకుంది
ఈ రీ ఎంట్రీ కోసం అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే నమ్ముకుంది. రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)లో అను ఇమ్మాన్యుయేల్‌కు ఒక కీలకమైన, నటనకు ఆస్కారమున్న పాత్ర లభించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె దుర్గ అనే పాత్రలో కనిపించనుంది. అంతేకాదు, ఇందులో బోల్డ్ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కెరీర్‌కు బ్రేక్ పడిన తర్వాత, ఈ పాత్ర ఆమెకు కొత్త ఇన్నింగ్స్‌ను అందిస్తుందని, మళ్లీ హీరోయిన్‌గా బిజీ అవుతానని ఆమె బలంగా ఆశపడుతోంది. అందులోనూ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో.. ఏదో ఒక భాషలో తనకు మంచి గుర్తింపు లభిస్తుందని కూడా ఆమె నమ్మకం వ్యక్తం చేస్తోందట.
Also Read- CM Revanth Reddy: సంక్షేమ నిధికి రూ.10 కోట్లు.. సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు
హిట్ కోసం ఎదురుచూపులు
అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ గ్రాఫ్ చూస్తే, ఆమెకు వచ్చిన అవకాశాలు చాలా పెద్దవి. అగ్ర హీరోల సరసన నటించినా, ఆ సినిమాలు ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇలాంటి సమయంలో, రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్ సినిమాలో కీలక పాత్ర పోషించడమనేది అను ఇమ్మాన్యుయేల్ తీసుకున్న మంచి నిర్ణయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇలాంటి నటనకు ప్రాధాన్యత ఉన్న, బోల్డ్ రోల్స్‌లో కనిపించడం ద్వారా నటిగా తన సత్తా చాటుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం మంచి విజయం సాధిస్తే, ఆ క్రెడిట్ ఖచ్చితంగా అందులో నటించిన వారికి దక్కుతుంది. ఈ సినిమా ద్వారా అను ఇమ్మాన్యుయేల్ తనలోని కొత్త నటిని ప్రేక్షకులకు పరిచయం చేయగలిగితే, మళ్లీ ఆమెకు హీరోయిన్‌గా లేదా కీలక పాత్రల్లో వరుస అవకాశాలు దక్కే అవకాశమైతే ఉంది. మరి ఈసారి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అండతో అను ఇమ్మాన్యుయేల్ తీసుకుంటున్న ఈ రీ ఎంట్రీ రిస్క్ ఆమెకు ఎంత వరకు కలిసొస్తుంది? ఆమె ఆశించినట్టుగా టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతుందా? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
