Aaryan Movie: విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ (Aaryan) మూవీ వాయిదా పడింది. ఈ వాయిదాకి కారణం ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja). అర్థం కాలేదు కదా. తమిళ హీరో సినిమా వాయిదాకు తెలుగు హీరోలు ఎలా కారణం? అని డౌట్ వస్తుంది కదా! కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ‘ఆర్యన్’ మూవీ ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కావాలి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. సడెన్‌గా రిలీజ్ డేట్ వాయిదా వేయడానికి కారణం.. సినిమాకు ఇంకా వర్క్ పెండింగ్ ఉండటమో.. లేదంటే సెన్సార్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడమో జరిగి ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా చిత్ర హీరో సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
Also Read- CM Revanth Reddy: సంక్షేమ నిధికి రూ.10 కోట్లు.. సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు
తమిళ్‌లో విడుదలైన వారం తర్వాతే..
‘ఆర్యన్’ తమిళ వెర్షన్ మాత్రం షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31నే విడుదల కాబోతోంది. ఒక వారం తర్వాతే తెలుగులో విడుదలవుతుంది. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్స్‌తో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసే పనిలో ఉన్నారు. టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ వంటి అద్భుతమైన స్పందనను రాబట్టుకుని అమాంతం అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఓ వారం పాటు సినిమా వాయిదా వేయడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అదే జరిగింది. వాయిదాకు గల కారణాలను స్పష్టం చేస్తూ విష్ణు విశాల్ చేసిన అనౌన్స్‌మెంట్ ఇదే..
Also Read- Dacoit: అడవి శేష్ ‘డకాయిట్’ రిలీజ్ డేట్ మారింది.. ఇక వచ్చే సంవత్సరమే!
ఈ వారం వారి సినిమాలే సెలబ్రేట్ చేసుకోవాలని..
‘‘డియర్ తెలుగు ఆడియన్స్.. సినిమా అనేది రేస్ కాదు, అది ఒక వేడుకని నేను ఎప్పుడూ నమ్ముతాను. ప్రతి వేడుకకీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, వెలుగు ఉండాలి. మా చిత్రం ‘ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కావలసి ఉంది. ఈ ప్రత్యేక తేదీ మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ (Ravi Teja Mass Jathara), పవర్ ఫుల్ ‘బాహుబలి ది ఎపిక్’ (Bahubali The Epic) మీ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకమైనది. నేను ఎప్పటినుంచో రవితేజ గారిని గాఢంగా ఆరాధిస్తాను. స్క్రీన్‌పైన ఆయన ఎనర్జీకి మాత్రమే కాకుండా, మాకు ఆయన మద్దతు (నా గట్టా కుస్తీ సినిమాకి ఆయన సహనిర్మాతగా ఉన్నారు) కూడా వుంది. అలాగే, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)కి నేను లైఫ్ టైం ఫ్యాన్‌ని. ఈ వారం వారి సినిమాలని సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. ‘ఆర్యన్’ సినిమా తమిళ్ విడుదలైన ఒక వారం తర్వాత అదే పాషన్, థ్రిల్ తో నవంబర్ 7న తెలుగులోకి వస్తుంది. మీ మద్దతుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి (Sreshth Movies)లకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినిమా తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలు అందించాలనే నా ప్రయత్నంలో ఇది ఒక మంచి ప్రారంభం అవుతుందని నేను నమ్ముతున్నాను’’ అని విష్ణు విశాల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో విష్ణు విశాల్‌పై తెలుగు ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
