Dacoit Release Date (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Dacoit: అడవి శేష్ ‘డకాయిట్’ రిలీజ్ డేట్ మారింది.. ఇక వచ్చే సంవత్సరమే!

Dacoit: పాన్-ఇండియన్ స్టార్ అడివి శేష్ (Adivi Sesh) తన తదుపరి మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ చిత్రం ‘డకాయిట్’ (Dacoit)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడీ మూవీ రిలీజ్ మారినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఉగాది స్పెషల్‌గా రాబోయే సంవత్సరం అంటే 19 మార్చి, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఇంటెన్స్ లుక్‌తో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్ అధికారికంగా విడుదల చేశారు. రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు.. అడివి శేష్, అందాల తార మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇంటెన్స్ లుక్స్‌లో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు పాత్రల తీరుతెన్నులను ఈ పోస్టర్ మరింత హైలైట్ చేస్తోంది.

Also Read- Bigg Boss Telugu 9: ఓవర్ కాన్ఫిడెంట్ పేరుతో రగులుతోన్న హౌస్.. గౌరవ్, భరణిలకు దివ్య ఇచ్చిపడేసింది

భారీ విజయం పక్కా..

షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంతో రూపొందుతోందనే విషయం ఇప్పటివకే వచ్చిన ‘ఫైర్ గ్లింప్స్’ చెప్పేసింది. ఈ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ విజువల్స్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా, విజువల్ క్వాలిటీ విషయంలో ‘డకాయిట్’ ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడైన అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘డకాయిట్’ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ విషయం ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అడివి శేష్ పాన్-ఇండియన్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా, ‘డకాయిట్’ విడుదలయ్యే అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read- JD Chakravarthy: చిన్న సినిమాకు జేడీ సపోర్ట్.. ఏం చేశారంటే?

వాయిదా ఎందుకు?

అడివి శేష్ సినిమాలన్నీ వైవిధ్యతను చాటేలా ఉంటాయనే విషయం తెలియంది కాదు. కానీ, ఎందుకు ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటుందనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో రకరకాలుగా అనుమానాలు వచ్చాయి. ఆమె స్థానంలో వెంటనే మృణాల్ వచ్చి చేరడంతో.. ఆ అనుమానాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు సినిమా ఎందుకు వాయిదా పడిందనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాకు విఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుందని అడివి శేష్ చెబుతూ వస్తున్నారు. బహుశా ఆ కోణంలో ఈ సినిమా ఆలస్యం అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆలస్యమైనా పర్లేదు.. అన్నీ చూసుకునే దిగమని అభిమానులు కూడా అడివి శేష్‌కు సూచిస్తున్నారు. ఉగాదికి కచ్చితంగా ఈ సినిమా విడుదల ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్