Bigg Boss Telugu 9 (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: ఓవర్ కాన్ఫిడెంట్ పేరుతో రగులుతోన్న హౌస్.. గౌరవ్, భరణిలకు దివ్య ఇచ్చిపడేసింది

Bigg Boss Telugu 9: కొన్ని మిర్రర్స్ ఇచ్చి.. భరణి (Bharani), శ్రీజ(Srija)ల రీ ఎంట్రీపై కొన్ని పాయింట్స్ రాసి, వారికి రియాలిటీ చెక్ ఇవ్వండి అని హౌస్‌మేట్స్‌ని బిగ్ బాస్ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన ప్రోమోలో ఇమ్ము, పవన్, మాదురి వారి అభిప్రాయాలను చెప్పారు. తాజాగా బిగ్ బాస్ మరో ప్రోమోని వదిలారు. ఈ ప్రోమో చూస్తుంటే రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ భరణి అని తెలుస్తోంది. ఎందుకంటే, ఈ ప్రోమోలో ఎక్కడా శ్రీజ కనిపించలేదు. భరణి మాత్రం హౌస్‌లో హౌస్‌మేట్స్‌తో కలిసి కనిపించారు. మరి ఏమైందనేది తెలియదు కానీ, రీ ఎంట్రీ ఇచ్చింది భరణినా? శ్రీజానా? లేక ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని గమనిస్తే.. ఇందులో మిర్రర్ టాస్క్ (Mirror Task) కంటిన్యూ అవుతున్నట్లుగా చూపించారు. గౌరవ్ వచ్చి భరణికి కొన్ని పాయింట్స్ చూస్తున్నారు. గౌరవ్ రైజ్ చేసిన పాయింట్స్‌తో హౌస్‌లో పెద్ద గొడవే జరిగినట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది.

Also Read- Bigg Boss Telugu 9: రీ ఎంట్రీ.. శ్రీజ అరాచకం షురూ.. భరణికి బిగ్ బాస్ ముందస్తు వార్నింగ్!

మా టీమ్ గెలిచి ఉంటే ఈ టాపిక్ వచ్చేదా..

ఈ ప్రోమోలో గౌరవ్ వచ్చేసి.. భరణిది ‘ఓవర్ కాన్ఫిడెంట్‌’గా మిర్రర్‌పై రాశారు. ఒక గేమ్‌లో వన్ గోల్, వన్ ఎలిమినేషన్.. అది ఫిజికల్ టాస్క్ కాదు. మెంటల్లీ కూడా కావాలి. కానీ మీరు మీ ఫిజిక్‌‌పై ఓవర్ కాన్ఫిడెంట్‌ని ప్రదర్శించారని గౌరవ్ తన అభిప్రాయం చెప్పారు. ‘మీరు గెలిచారు కాబట్టి.. ఓవర్ కాన్ఫిడెంట్ అనే మాట వచ్చింది. మా టీమ్ గెలిచి ఉంటే ఈ టాపిక్ రాదు కదా..’ అని భరణి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. ఈ టాస్క్‌లో భరణి టీమ్‌లో ఉన్న దివ్య.. గౌరవ్‌ని టార్గెట్ చేస్తూ.. ‘ఈ హౌస్‌లో ప్రతీది అందరి మ్యాటరే. నువ్వు టీమ్ టాస్క్ అడిగావు, ఆ టీమ్‌లో నేను ఉన్నాను కాబట్టి.. బరాబర్ మాట్లాడతాను. నేనూ ఆ గేమ్‌లో ఉన్నాను. నీకు ఒక్కరే కాంపిటేషన్ అన్నట్లుగా మాట్లాడటం నచ్చలేదు. నువ్వు ఆ గేమ్‌లో ఏ పొజిషన్‌లో ఉన్నావో.. నేను కూడా అదే పొజిషన్‌లో ఉన్నాను’ అంటూ గౌరవ్‌కి దివ్య ఇచ్చిపడేసింది (Gourav VS Divya Nikhita).

Also Read- Bigg Boss Telugu: కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు.. ఫేక్ రిలేషన్స్ పెట్టుకోలేదు.. ప్రోమోలో భరణి వైల్డ్ ఫైర్!

వాడికి చెప్పాల్సింది చెప్పాను

దీనిపై భరణి, తనూజ (Tanuja)ల మధ్య కూడా డిష్కషన్ నడుస్తుంది. ‘వాడికి ఇవ్వాల్సింది గట్టిగా ఇచ్చాను’ అని భరణి అంటే, మీ గురించి ఆమె ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది? అని తనూజ ప్రశ్నించింది. అనంతరం దివ్యని పిలిచి.. ‘దివ్యా.. నేను వాడికి చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు’ అని ప్రశ్నించారు. దీనికి దివ్య సీరియస్ అవుతూ.. ‘ఆ టీమ్‌లో గౌరవ్ ఏ పొజిషన్‌లో ఉన్నాడో.. నేనూ అదే పొజిషన్‌లో ఉన్నా. మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని నా ప్రతి సిచ్యుయేషన్ నుంచి నేను తప్పించుకోలేను కదా. నా పాయింట్ నేను చెప్పాలి కదా. భరణిగారు ఉన్నారు.. అయ్యో మళ్లీ బాండింగ్ అనుకుంటారు అని చెప్పి నేను పారిపోనా? చెప్పండి’ అంటూ అడిగేసింది. ఒక్కసారిగా భరణి ఫేస్ కూడా మాడిపోయింది. మొత్తంగా చూస్తే.. ఈ రోజు హౌస్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయనేది.. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ అన్నీ తెలియజేస్తున్నాయి. చూద్దాం.. మరి ఈ రోజు ఎపిసోడ్ ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేస్తుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?