Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌లో రీ ఎంట్రీల పర్వం నడుస్తోంది. ఆల్రెడీ ఎలిమినేటై వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపించి.. హౌస్‌లో వాతావరణాన్ని మార్చేశారు. ఈ క్రమంలో వీరిలో నుంచి ఎవరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని, 51వ రోజుకు చేరుకుంది. 51వ రోజుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోని తాజాగా టీమ్ విడుదల చేసింది. ఇందులో రీ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చినట్లుగా ఉంది. అయితే రీ ఎంట్రీని అంతా అషామాషీగా అయితే బిగ్ బాస్ ప్లాన్ చేయలేదు. ఇంటిలోని మెంబర్స్‌తో రాబోయే కంటెస్టెంట్స్‌కి సజెషన్స్ చెప్పిస్తున్నారు. ఈ సజెషన్స్‌ని బట్టి రీ ఎంట్రీ కంటెస్టెంట్‌ని ఎన్నుకుంటారా? లేదంటే ఇంకా ఏమైనా ఫిజికల్ టాస్క్‌లు పెడతారా? అనేది అయితే క్లారిటీ లేదు. తాజాగా వచ్చిన ప్రోమోలో మాత్రం కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. అసలీ ప్రోమోలో ఏముందంటే..
Also Read- Kantara Chapter 1 OTT: ‘కాంతార: చాప్టర్ 1’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
తప్పులు సరి చేసుకోండి
నిన్న మీరు మీ ఎక్స్ హౌస్‌మేట్స్‌లో కొందరిని ఎదుర్కొన్నారు. వారిలో ఎవరు మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి, పర్మినెంట్ హౌస్‌మేట్స్‌గా మారే అవకాశం పొందుతారో అన్నది.. చూసే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ వాయిస్‌లో ఈ ప్రోమో మొదలైంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న మెంబర్స్ అందరినీ ఒకచోటకు చేర్చి బిగ్ బాస్ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆ వెంటనే శ్రీజ (Srija), భరణి (Bharani) హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. భరణి, శ్రీజ.. ఈ రణరంగంలో నిలబడాలంటే.. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించడం, వాటిని సరి చేసుకోవడం చాలా ముఖ్యమరి చెప్పి, రీ ఎంట్రీ కంటెస్టెంట్స్‌కు ముందస్తు హెచ్చరికనిచ్చారు బిగ్ బాస్. ఆ వెంటనే ఓ టాస్క్ ఇచ్చారు. అదేంటంటే.. కొన్ని మిర్రర్స్ అక్కడ పెట్టి.. వాటిపై రీ ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ గురించి కొన్ని పాయింట్స్ రాసి, వారికి రియాలిటీ చెక్ ఇవ్వండి అని హౌస్‌మేట్స్‌ని బిగ్ బాస్ సూచించారు.
Also Read- Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?
ఎక్కువ సాగదీయవద్దు
ముందుగా ఇమ్మానుయేల్ వచ్చి ఒక మిర్రర్ తీసుకుని, ‘శ్రీజాకు చెబుదామని అనుకుంటున్నాను. ఏదైనా గొడవ ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయడం మన హక్కు. కాకపోతే దానిని ఎక్కువ సాగదీయవద్దు’ అని చెప్పారు. తర్వాత పవన్ వచ్చి భరణి పేరును సూచిస్తూ.. ట్రస్ట్ అని రాశారు. ‘నేను మీ విషయంలో మూడు సార్లు డిజప్పాయింట్ అయ్యాను. మిమ్మల్ని నెక్ట్స్ టైమ్ నమ్మాలన్నా, కొంచెం ఆలోచించాల్సి వస్తుంది’ అని చెప్పగానే.. ‘నువ్వు నా మీద ట్రస్ట్ ఉంచుకుంటావా, ఉంచుకోవా? అన్నది నీ వ్యక్తిగత అభిప్రాయం’ అని భరణి రిప్లయ్ ఇచ్చారు. ఆ తర్వాత మాధురి వచ్చి.. శ్రీజ ప్రేరు చెబుతూ.. ‘మైండ్ యువర్ వర్డ్స్’ అని రాశారు. వారిద్దరి మధ్య కొంత వాగ్వివాదం నడిచింది. ‘నేనెప్పుడూ నోటికి ఏది వస్తే అది మాట్లాడను. జనరల్‌గా మీరు మాట్లాడే విధంగా అయితే నేను ఎప్పుడూ మాట్లాడలేదన్నమాట. నాకసలు అలా రాదు కూడా. నేనెప్పుడూ కూడా బిలో ద బెల్డ్ వెళ్లి మాట్లాడలేదు. ఇది సజెషన్ కాదు.. దీనిని నేను యాక్సెప్ట్ చేయను’ అంటూ మాధురికి శ్రీజ కౌంటర్ ఇస్తోంది. దీంతో ఈ ప్రోమో ముగిసింది. మరి వీరిద్దరిలో ఒక్కరికే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మిర్రర్ టాస్క్‌లో భరణికే ఎక్కువగా పాయింట్స్ (మిర్రర్స్) వచ్చినట్లుగా తెలుస్తుంది. ఫైనల్‌గా ఈ ఇద్దరి నుంచి ఎవరిని హౌస్‌లోకి తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. శ్రీజ ఎలిమినేటై వెళ్లినప్పటి నుంచి.. బయట పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది కాబట్టి.. ఎక్కువగా ఆమెకే రీ ఎంట్రీ ఛాన్స్ ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. చూద్దాం.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
