Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగులో సోమవారం మెుదలైన నామినేషన్స్ (అక్టోబర్ 27).. నేడు కూడా కొనసాగింది. గత వారాల్లో ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా సైనీ, దమ్ము శ్రీజ వచ్చి హౌస్ లోని పలువురు సభ్యులను నామినేట్ చేశాడు. అయితే మంగళవారం రోజు నామినేషన్స్ లో మాజీ కంటెస్టెంట్స్ భరణి, శ్రేష్ఠి వర్మ పాల్గొన్నారు. మంగళవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అందులో భరణి చేసిన కామెంట్స్ హైలేట్ గా నిలుస్తున్నాయి.
‘ఇమ్మాన్యుయేల్.. ఒక కట్టప్ప’
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా భరణి ఇంట్లో అడుగుపెట్టడంతో ప్రోమో ప్రారంభమైంది. భరణిని చూడగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకోవడం ప్రోమోలో చూడవచ్చు. ఈ సందర్భంగా హౌస్ మేట్ ఇమ్మాన్యుయేల్ సైతం దగ్గరకు వెళ్లగా.. భరణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇమ్మాన్యుయేల్ ను దగ్గరకు తీసుకుంటూ.. ‘కట్టప్ప.. చంపేశావుగా అమరేంద్ర బాహుబలిని. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప’ అని వ్యాఖ్యానిస్తాడు.
సంజనాపై భరణి ఫైర్..
నామినేషన్స్ కోసం ఇంట్లోకి అడుగుపెట్టిన భరణి.. సంజనాను నామినేట్ చేయడం ప్రోమోలో చూడవచ్చు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ.. ‘లయన్ అన్న, భరణి అన్న అని పిలిచినప్పుడు మిమల్ని సిస్టర్ గానే భావించాను. నేను ఎవరి దగ్గర, ఏ రోజూ కూడా ఫేక్ రిలేషన్స్ మెయిన్ టెన్ చేయలేదు’ అని అన్నారు. అప్పుడు సంజనా బదులిస్తూ.. ‘మీరు బయటకు వెళ్లిందే బాండ్స్ వల్ల’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు భరణి స్పందిస్తూ ‘మీ వరకు వస్తే రూల్స్.. మిగితా హౌస్ మేట్స్ విషయానికి వస్తే మీకు రూల్స్ ఉండవు’ అని అన్నారు. హౌస్ లో ఒక వ్యక్తి గురించి ఏదోటి అనేస్తారు. తిరిగి సారీ చెబితే సరిపోతుందా? అని సంజనాను భరణి ప్రశ్నించడం ప్రోమోలో కనిపించింది.
Also Read: Disability Empowerment: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..!
డిమోన్‌కు బుద్దిబలం లేదు: శ్రేష్ఠి
నామినేషన్ కు కోసం ఇంట్లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్ శ్రేష్ఠి వర్మ.. డిమోన్ పవన్ పై నిప్పులు చెరిగారు. ‘డిమోన్ కు కండ బలం ఉంది.. బుద్ది బలం లేదు’ అని వ్యాఖ్యానించారు. నా కళ్లతో చూసినవే నమ్ముతా. నేను జెన్యూన్ గా ఫీల్ అయితే అది నేను మార్చుకోను’ అని డిమోన్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రీతూ వైపు చూపిస్తూ ఆటలో ఆమెకు చాలా క్లారిటీ ఉందని శ్రేష్ఠి వ్యాఖ్యానించారు. మీకు క్లారిటీ లేదని డెమోన్ పై ఫైర్ అయ్యారు. మరోవైపు భరణి లేదా శ్రేష్ఠి నుంచి నామినేషన్ పవర్ తీసుకున్న హౌస్ మేట్ నిఖిల్.. తనూజాను నామినేట్ చేయడం ప్రోమోలో చూపించారు. ఈ సందర్భంగా ఆట విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
