Megastar Chiranjeevi (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన రెండవ ఇన్నింగ్స్‌లో ఎంచుకుంటున్న సినిమాల విషయంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల ఆయన చేస్తున్న లేదా చేయబోతున్న కొన్ని చిత్రాలలో ఇతర స్టార్ హీరోలు ముఖ్య పాత్రల్లో భాగం కావడం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించడం, తాజాగా చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ (Venkatesh) భాగమవుతుండటం, అలాగే రాబోయే చిరు-బాబీ కాంబినేషన్ సినిమాలో తమిళ స్టార్ కార్తీ (Karthi) భాగం కాబోతున్నారనే ఊహాగానాలు ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, చిరంజీవి కావాలనే ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారా? అనే చర్చ సినీ వర్గాల్లో ప్రముఖంగా నడుస్తోంది.

Also Read- Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

స్టార్ హీరో ప్యాడింగ్ అందుకేనా..

చిరు రీ ఎంట్రీలో.. తన సొంత స్టార్‌డమ్‌పై నమ్మి చేసిన ‘భోళా శంకర్’ భారీ డిజాస్టర్‌గా నిలవగా, రవితేజతో కలిసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకుంది. అంతకుముందు చేసిన ‘సైరా నరసింహారెడ్డి’లో కూడా పలువురు స్టార్ నటులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. దీంతో, ఒక స్టార్ హీరో ప్యాడింగ్ ఉంటే, ఆ సినిమాకు అదనపు బజ్ వస్తుందని, కలెక్షన్లలో కూడా సేఫ్టీ ఉంటుందని భావించి.. చిరంజీవి ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ నిర్ణయం మంచిదే అని కొందరు అంటుంటే, మరోవైపు యాంటీ-ఫ్యాన్స్ మాత్రం ‘చిరంజీవి స్టామినా తగ్గిపోయింది, అందుకే ఇతర హీరోల సహాయం తీసుకుంటున్నారు’ అనేలా విమర్శలు చేస్తున్నారు.

Also Read- Aaryan Movie: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ విడుదల వాయిదా.. కారణం రవితేజ, ప్రభాసే!

సేఫ్ గేమ్ కాదు..

చిరు విషయంలో దీనిని సేఫ్ గేమ్ అనే కంటే.. వ్యూహాత్మక స్టెప్ అంటే బాగుంటుందేమో. ఈ మల్టీస్టారర్ల వల్ల మార్కెట్ పరిధి పెరుగుతుంది. రవితేజ, కార్తీ లాంటి స్టార్స్ తోడైతే, ఆయా హీరోల ఫ్యాన్స్ బేస్ కూడా సినిమాకు అదనపు బలంగా మారుతుంది. ఇది నేటి పాన్-ఇండియన్ ట్రెండ్‌కు చాలా అవసరం. అలాగే కేవలం మల్టీస్టారర్ మాత్రమే కాదు, చిరంజీవి ప్రస్తుతం ఎంచుకుంటున్న కథల్లో వైవిధ్యం ఉంది. ‘విశ్వంభర’ లాంటి భారీ గ్రాఫిక్స్, స్టార్స్ లేని ఫాంటసీ ప్రాజెక్ట్‌ను ఆయన ఒంటరిగా చేస్తున్నారు. ఇది రిస్క్ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని రుజువు చేస్తుంది. ఇంకా చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో యువ దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో, స్క్రిప్ట్‌కు అవసరమైనప్పుడు ఇతర హీరోలను భాగం చేయడం అనేది కథ డిమాండ్ కూడా కావచ్చు, కేవలం సేఫ్టీ కోసం మాత్రమే కాదు. ఏదేమైనా, ‘భోళా శంకర్’ అనుభవం తర్వాత, చిరంజీవి తన సినిమాల ఎంపికలో మరింత అప్రమత్తంగా ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఇతర స్టార్స్ భాగస్వామ్యం ఆయన సినిమాలకు కొత్త ఊపునిచ్చి, బాక్సాఫీస్ వద్ద మరింత సురక్షితమైన వసూళ్లను అందించడంలో సహాయపడుతుంది. అంతిమంగా, సినిమా సక్సెస్ అయితే, ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందనే విషయం తెలియంది కాదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?