Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone) గత కొద్ది రోజులుగా భారతీయ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యంగా, రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయాలనే ఆమె డిమాండ్‌పై రేగిన వివాదం, ఆమెను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించే వరకు వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో, దీపికా పదుకొనెను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
8 గంటల డిమాండ్‌తో మొదలైన చిక్కులు
తాను తల్లి అయిన తర్వాత పని-జీవిత సమతుల్యత కోసం, రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని దీపికా పదుకొనె చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మూలం. ఈ కారణంగానే ఆమె ప్రభాస్ (Prabhas)తో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయాల్సిన ‘స్పిరిట్’ (Spirit) సినిమాతో పాటు, నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) పార్ట్ 2లో కూడా అవకాశం కోల్పోయింది. ‘కల్కి 2898 AD’ టీమ్ అయితే ఏకంగా.. ‘సినిమాకు పూర్తి నిబద్ధత (Commitment) అవసరం’ అంటూ పరోక్షంగా దీపికా నిబద్ధత లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆమెను సీక్వెల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?
టాలీవుడ్ సెలబ్రిటీల పరోక్ష విమర్శలు
దీపికా చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత, టాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులు ఈ పని గంటల అంశంపై స్పందిస్తున్నారు. తాజాగా నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా ఈ చర్చలో భాగమైంది. ‘రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాం కాబట్టి, ఎక్కువ సమయం చేయాలి’ అనే కోణంలో రష్మిక మాట్లాడింది. అయితే, ఈ మాటలతో పాటు ఆమె ‘కుటుంబంతో సమయం గడపడం, ఆరోగ్యం కూడా ముఖ్యమే’ అని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ, చాలా మంది సెలబ్రిటీలు పరోక్షంగా దీపికా డిమాండ్‌ను తప్పుబడుతూ మాట్లాడడం విశేషం. దీపికా మాత్రం ఈ విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘భారతీయ సినీ పరిశ్రమలో చాలా మంది మగ సూపర్‌స్టార్‌లు సంవత్సరాలుగా కేవలం 8 గంటలే పని చేస్తున్నారు. అప్పుడు లేని వివాదం, నేను అడిగితే ఎందుకు?’ అంటూ ఆమె లింగ వివక్షతను ప్రశ్నించారు.
Also Read- Pawan Kalyan: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ఓటీటీలో పేరు తొలగింపుతో మరింత అవమానం?
వివాదం ఇంతటితో ఆగలేదు. ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి తొలగించిన మేకర్స్, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతున్నప్పుడు టైటిల్ కార్డ్స్‌లో దీపికా పదుకొనె పేరును కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కథాంశంలో కీలక పాత్ర పోషించిన నటి పేరును ఈ విధంగా తీసివేయడం ఆమెను మరింత అవమానించడమేనని ఆమె అభిమానులు, నెటిజన్లు నిర్మాణ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను గమనించిన సినీ విశ్లేషకులు, దీపికా కేవలం పని గంటల కోసమే తప్పుకుందా? లేదంటే తెరవెనుక భారీగా రెమ్యూనరేషన్ లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేలా అనుమానిస్తున్నారు. ఏదేమైనా, ఒక స్టార్ హీరోయిన్‌గా ఆమె డిమాండ్‌ను ఈ స్థాయిలో వ్యతిరేకించడం, ఆమెను బహిరంగంగా అవమానిస్తున్నారనే భావన ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత వివాదాస్పదం చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
