VC Sajjanar: ప్రజలకు అవసరమైన సమాచారం, ముఖ్యంగా రోడ్ల మూసివేతలు, ట్రాఫిక్ జామ్‌లు, విద్యుత్ అంతరాయాలు, వాతావరణ హెచ్చరికలు, ప్రభుత్వ సహాయక చర్యలు వంటి వివరాలను సమయానుకూలంగా తెలుసుకోవడం చాలా అవసరం. అందుకోసం సంబంధిత ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, పోలీస్, విపత్తు నిర్వహణ సంస్థలు, విద్యుత్ శాఖ వంటి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావడం చాలా ఉపయోగకరం. ఈ అకౌంట్లు విశ్వసనీయమైనవి కాబట్టి తప్పుడు వార్తల బారిన పడకుండా, వాస్తవికమైన సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఈ అధికారుల సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే ఎక్స్, ఫేస్‌బుక్ వేదికగా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న హైదరాబాద్ సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar), నగరవాసులకు మరింత చేరువయ్యేందుకుగానూ కొత్తగా వాట్సప్‌లో కూడా అందుబాటులోకి వచ్చారు. వాట్సప్ ఛానల్‌ను ఆయన ప్రారంభించారు.
Read Also- GHMC Commissioner: ఎన్నికల నిబంధన ప్రకారమే విధులు నిర్వర్తించాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
పౌరులకు రియల్-టైమ్ సమాచారాన్ని అందించేందుకు అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను సజ్జనార్ ప్రారంభించారు. భారతదేశంలో అత్యంత సురక్షితంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ అయిన హైదరాబాద్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌లను అస్సలు మిస్ కాకుండా, సమాచారం తెలుసుకోవడానికి ఈ ఛానెల్‌ను ఫాలో అవ్వాలని ఆయన సూచించారు. @SajjanarVC @CPHydCity లను ఫాలో కొట్టాలని సూచించారు.
Read Also- Jubliee Hills Bypoll: ‘జూబ్లిహిల్స్ మీ అయ్య జాగీరా?’.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్
కాగా, సజ్జనార్ ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్‌గా తన కెరీర్‌ను వరంగల్ జిల్లాలో ప్రారంభించారు. ఆ తర్వాత నల్గొండ, కడప, గుంటూరు, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎస్‌పీగా పనిచేశారు. 2008లో వరంగల్ యాసిడ్ దాడి కేసులో, 2019లో దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. మహిళలు, పిల్లల భద్రత, సైబర్‌క్రైమ్, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు.
Follow me on my WhatsApp channel for regular updates: https://t.co/CTAVnR1WVY https://t.co/AtpMVA78In
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 29, 2025
