GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: వచ్చే వార్షిక బడ్జెట్ పై జీహెచ్ఎంసీ ఫోకస్.. ఈసారి జరిగే మార్పులివే..!

GHMC: వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)కు వార్షిక బడ్జెట్ రూపకల్పనపై జీహెచ్ఎంసి(GHMC) ఫోకస్ పెట్టింది. గత ఏడాదికంటే ఈ ఏడాది వార్షిక బడ్జెట్ అంచనాలు రూ. 1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు వరకు పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసి చట్టం-1955 సెక్షన్ 182 ప్రకారం వచ్చే ఆర్ధిక సంవత్సరం వార్షిక బడ్జెట్ అంచనాల నివేదికను ప్రతి ఏటా నవంబర్ 10వ తేదీలోపు జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ(Standing Committee) సమావేశం ముందుకు ప్రవేశపెట్టాలన్న నిబంధనని ఉన్నందున కమిషనర్ కర్జన్(Commissioner Karnan) ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న జరుగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు 2026-27 వార్షిక బడ్జెట్ అంచనాలతో కూడిన నివేదిక ప్రవేశపెట్టేందుకు కమిషనర్ సిద్దమవుతున్నట్లు సమాచారం.

ఆర్థిక సంవత్సర అవసరాలు.. 

కొద్దిరోజుల ముందే జిహెచ్ఎంసి(GHMC) లోని వివిధ విభాగ అధిపతులు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.. ఈ నేపథ్యంలోనే జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, సిటీ ప్లానర్లు, ఎస్ఈలు వార్షిక బడ్జెట్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను సిద్ధం చేయడం వర్ధమాన ఆర్థిక సంవత్సర అవసరాలు, మునుముందు చేపట్టనున్న అభివృద్ధి పనులు మెయింటైనెన్స్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. డిప్యూటీ కమిషనర్ల నుండి సానుకూలంగా స్పందన వస్తున్నందున బడ్జెట్ అంచనాలు పెరుగుతాయని చర్చ జరుగుతుంది.

Also Read: Telugu Indian Idol Season 4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ ఎవరంటే?

రూ.11 వేల కోట్లతో బడ్జెట్ రూపకల్పన?   

వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు రూ. 10 వేల కోట్ల మార్కును దాటే అవకాశాలన్నట్టు పాలక మండలి వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెవెన్యూ రిసీట్స్(Revenue receipts) రూ.4,445 కోట్లుగా ఉంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ .5,550 కోట్లుగా ఉండొచ్చని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్(Capital expenditure) రూ.4000 కోట్లుగా ప్రస్తుతముంటే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ వ్యయం రూ.5500 కోట్లుగా పెరుగుతుందనీ చూసి నడుస్తుంది. హెచ్ సిటీ(H-City) ప్రాజెక్టులు కార్యరూపం లోకి రానున్నవి. ఎస్ఆర్డీపీ(SRDP) ఎస్ఎన్డీపి(SNTP) రెండో దశ పనులను ఇప్పటికే సర్కారు హెచ్ సిటీ వన్ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పనులు క్షేత్రస్థాయిలో మొదలుకానునందున, వీటికి తోడు వరద నీటి కాలువలు,నాలాల మాస్టర్ ప్లాన్లు, మరో రూ. 3 వేల కోట్ల పైచిలుకు ఔటర్ వరకు వీధిదీపాల నిర్వహణలు చేపట్టనున్న విషయాన్ని బడ్జెట్లో పొందుపరుస్తూ ఆదాయం, వ్యయాన్ని సమానంగా పేర్కొన్నట్లు సమాచారం. 2024-25లో బడ్జెట్ అంచనాలు రూ. 7,937 కోట్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.8,440 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ రెండు బడ్జెట్ల వ్యత్యాసం రూ.503 కోట్లుగానే ఉంది. అయితే, వచ్చే వార్షిక బడ్జెట్ అంచనాలు రూ.11 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నట్టు పాలక వర్గాలు అభిప్రాయం.

పాలకమండలి అధికార గడువు.. 

రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో జిహెచ్ఎంసికి కేటాయింపులు పెరుగుతాయని పాలకమండలి భావిస్తుంది. పైగా వచ్చే ఫిబ్రవరి 11వ తేదీతో పాలకమండలి అధికార గడువు ముగుస్తుండడంతో అంతలోపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తయారు చేసి తమ మార్కు పదిలం చేసుకోవాలని పాలకమండలి భావిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు జిహెచ్ఎంసి రెవెన్యూ రిసీట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే టౌన్ ప్లానింగ్ , జిహెచ్ఎంసి ఆస్తుల అద్దెలతో ఎస్టేట్ ఆదాయం, పార్కులు, వ్యాపార సంస్థలకు జారీ చేసే ట్రేడ్ లైసెన్సులు వంటి ఆదాయాలు కూడా పెరిగే అవకాశాలు ఉండడంతో వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆదాయాన్ని దానికి తోడుగా వ్యయాన్ని కూడా పెంచుకునేలా బడ్జెట్ రూపకల్పన చేసే దిశగా అధికారులకు కసరత్తు కొనసాగుతున్నట్లు తెలిసింది.

Also Read: KTR: జూబ్లీ బైపోల్‌తో కాంగ్రెస్ పాలన అంతం.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Just In

01

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!

HYDRA: హైడ్రా ప్ర‌జావాణికి విశేష స్పందన.. సోమవారం ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?

Telangana BJP: గతంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. ఈసారీ వర్కౌట్ అయ్యేనా..?

Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!