Telugu Indian Idol Season 4: తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో గా పేరొందిన ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 (Telugu Indian Idol Season 4) ముగిసింది. సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా గ్రాండ్ ఫినాలే (Grand Finale) జరుపుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) స్పెషల్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమోలో రవితేజ ఎనర్జీ, అందరినీ అలరించింది. అలాగే ఒక సింగర్‌కు ఆయన తన సినిమాలో పాడే అవకాశం కూడా స్పాట్‌లో ఇచ్చేశారు. అలా ప్రోమోతోనే వైరల్ అయిన.. ఈ గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరో తెలిసిపోయింది. ఎంతో ఎనర్జీగా, ఎమోషనల్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఈ గ్రాండ్ ఫినాలేలో సింగర్ బృంద విజేతగా నిలిచి సీజన్ 4 ట్రోఫీని అందుకుంది. మరో సింగర్ పవన్ కళ్యాణ్ రన్నరప్‌గా నిలిచారు.
Also Read- Prasanth Varma: రెండు వైపులా విషయం తెలుసుకోండి.. మీడియా సంస్థలపై చురకలు!
ట్రోఫీతో పాటు రూ. 10 లక్షలు క్యాష్ ప్రైజ్
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్, సింగింగ్ లెజెండ్ కార్తీక్, సింగర్ గీతా మాధురి జడ్జిలుగా వ్యవహరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4.. ఎంత గ్రాండ్‌గా మొదలైందో.. అంతే గ్రాండ్‌గా ఫినాలేను జరుపుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో విన్నర్‌గా నిలిచిన బృందకు ట్రోఫీతో పాటు రూ. 10 లక్షలు క్యాష్ ప్రైజ్‌ను థమన్ అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విన్నర్‌గా నిలిచిన బృంద తన నెక్ట్ మూవీలో పాట పాడుతుందని, షో జడ్జి, మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్ అనౌన్స్ చేశారు. సింగర్‌గా బృంద కెరీర్‌కు ఆరంభంలోనే ఇదొక బిగ్ స్టెప్ కానుంది. తెలుగు మ్యూజిక్ టాలెంట్‌కు గుర్తింపు తీసుకురావడంలో తెలుగు ఇండియన్ ఐడల్ షో గొప్ప కృషి చేస్తోందని చెప్పవచ్చు. తన మ్యూజిక్‌తో రికార్డులను బద్దలు కొడుతున్న థమన్ ఈ షోకు జడ్జిగా ఉండటంతో ఈ షోపై ఎక్కడా లేని హైప్ నెలకొంది. గత నాలుగు సీజన్స్‌గా ఎంతోమంది యంగ్, టాలెంటెడ్ సింగర్స్‌ను ఈ షో ప్రపంచానికి పరిచయం చేసిందంటే.. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.
Also Read- Tollywood star kids: స్టార్ కిడ్స్‌కి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయా?.. టాలెంట్ అక్కర్లేదా?..
మాస్ మహారాజా స్పెషల్ అట్రాక్షన్
ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో మాస్ మహారాజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన ప్రతి సింగర్‌ని ఎంకరేజ్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆయన ఎనర్జీ, ఎంకరేజ్‌మెంట్ సింగర్స్‌కు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. మధ్య మధ్యలో తన సినిమా ముచ్చట్లతో అలరించిన మాస్ రాజా.. చివరిగా ఎవరు విన్నర్? ఎవరు లూజర్ అనే విషయంలో వ్యవహరించిన తీరు కూడా అందరినీ అలరించింది. ఇంత వరకు వచ్చి, ఈ స్టేజ్‌పై పాడిన ప్రతి ఒక్కరూ నా దృష్టిలో విన్నర్సే, ఎవరూ ఓడిపోలేదు.. అంతా విన్నర్సే అని ఆయన చెబుతుంటే.. సింగర్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. మొత్తంగా అయితే ఈ సీజన్ 4 చాలా గ్రాండ్‌గా ముగిసింది. సీజన్ 5 ఎప్పుడనేది.. త్వరలోనే ఆహా ప్రకటించనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
