Nidhhi Agerwal: సంక్రాంతి పండుగ స్పెషల్‌గా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్‌ఫార్మెన్స్‌తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్‌లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్‌పై మొదటి నెగిటివ్‌గా టాక్ నడిచినా, కొత్త సీన్లు యాడ్ చేసిన తర్వాత సినిమా బాగానే ఉందంటూ ప్రేక్షకులు సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను అన్ కాంప్రమైజ్డ్‌గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ది రాజా సాబ్’ సక్సెస్ సంతోషాన్ని హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..
Also Read- Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు.. అనసూయ షాకింగ్ పోస్ట్
సినిమా కథ మొత్తం ముందే విన్నా..
‘‘రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా కోసం మేమంతా దాదాపు 3 ఏళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇచ్చారనే భావిస్తున్నాం. సినిమాకు మొదట్లో కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. నేను ఇందులో బెస్సీ అనే రోల్ చేశాను. ఈ నన్ రోల్‌లో డివైన్‌గా కనిపించాలి. ఈ పాత్ర కోసం చాలా ప్రిపరేషన్స్ చేశాం. ముఖ్యంగా డ్రెస్ ఎలా ఉండాలనే విషయంలో చాలా చర్చలు నడిచాయి. ఈ సినిమాకు ముందు సినిమా ‘హరి హర వీరమల్లు’లో నేను రాకుమారి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఏంజెల్‌గా కనిపించాను. ఈ రోల్‌లో నటించడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. కేవలం నా పాత్ర వరకే కాకుండా ఈ సినిమా కథ మొత్తం విన్నాను. కథ విన్నప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని దర్శకుడు మారుతి కొత్తగా చూపించారు. ఆ పాయింట్ యూనిక్‌గా అనిపించింది.
Also Read- Anaganaga Oka Raju Review: సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ ఎలా చేశాడంటే?.. ఫుల్ రివ్యూ..
ప్రభాస్ ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు
సప్తగిరి, ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్.. ఇలా చాలామంది కమెడియన్స్‌తో ఇందులో కలిసి సీన్స్ చేశాం. సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. నేను ‘హరి హర వీరమల్లు’తో పాటే ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర కూడా ఉండేది కాదు. ఆ టైమ్‌లో ‘రాజా సాబ్’ మేకర్స్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నన్ను సెట్‌లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు నిధి అగర్వాల్ అంటే సెట్‌లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు. ప్రభాస్‌తో వర్క్ చేయడం ప్లెజర్‌గా ఫీలయ్యాను. ఆయన ఎప్పుడూ తానొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనేలా బిహేవ్ చేయలేదు. అందరితో సరదాగా కలిసిపోయేవారు. ఆయనలోని మంచితనం, వినయం చూశాక మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుందనే విషయాన్ని మరింతగా నమ్మాను. హాస్పిటల్ సీన్‌లో ఆయన అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయనతో సెట్‌లో సినిమాలు, లైఫ్.. ఇలా అనేక విషయాల గురించి సరదా సంభాషణలు జరిగేవి’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

