Mahabubabad Tahsildar: అక్రమాలకు నిలయంగా తహసీల్దార్‌
Mahabubabad Tahsildar ( image credit: swetcha reportewr)
నార్త్ తెలంగాణ

Mahabubabad Tahsildar: అక్రమాలకు నిలయంగా తహసీల్దార్‌ కార్యాలయం.. చేయి తడిపితేనే భూముల సర్వేలు చేస్తారా?

Mahabubabad Tahsildar: మహబూబాబాద్ తహసిల్దార్ కార్యాలయం అక్రమాలకు ప్రథమ అడ్డగా నిలుస్తున్నట్లు పట్టణంలోని ప్రజలు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన వివాదాస్పద భూముల సర్వేలు చేయడానికి ప్రధానంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ ఇద్దరు జాయింట్ గా సర్వే చేస్తేనే అందుకు సంబంధించిన సమస్య పరిష్కరించడానికి వీలవుతుంది. ఇదే ఆసరా చేసుకున్న ఆ ఇద్దరు రైతుల వద్ద నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసి, ఆ నగదును మండల రెవెన్యూ అధికారి, డివిజనల్ రెవిన్యూ అధికారి కి తామే సర్దుబాటు చేస్తున్నామని ఓపెన్ గానే రైతులకు చెబుతున్నారు. రైతులు మాత్రం సర్వేకు వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ లకు సర్వ సౌకర్యాలు కల్పించి బ్రతిమిలాడి భామాలి వారి వరకు డబ్బులు ఇస్తామంటే ససేమిరా అంటూ ఒప్పుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ ఇద్దరు కలెక్షన్ కింగ్స్

మహబూబాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందితోపాటు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ ఇద్దరూ కూడా రైతుల భూములు, ఇతర రియల్ ఎస్టేట్ లకు సంబంధించిన వివాదాస్పద భూముల సర్వేలు చేస్తూ వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ కలెక్షన్ కింగ్ లుగా మారుతున్నారు. అంతేకాకుండా తాము తీసుకున్న డబ్బులు నుంచి మండల అధికారి, డివిజనల్ అధికారికి ఇస్తున్నామని ఖరాఖండిగా వెల్లడిస్తున్నారని చర్చ సాగుతోంది. రైతులకు చేయకుండా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే సర్వేలు ధరణి పోర్టల్ లో రైతులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారం కానీ వారందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూభారతి చట్టం ద్వారా తమ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు.

లంచం ఇస్తేనే రైతుల భూముల సర్వేలు చేస్తా

ఇందుకు సంబంధించి కుటుంబ పరంగా, నువ్వు లావాదేవీల పరంగా వివాదాస్పదమైన భూముల కు సర్వేలు చేయాలని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన సర్వేల విషయంలో ఉత్సాహం ప్రదర్శిస్తూ వారిచ్చిన డబ్బులను పంచుకొని దాచుకుంటున్నారు. అంతేకాకుండా మండల, డివిజనల్ అధికారి లకు కూడా తామే డబ్బులు ఇస్తామని డిమాండ్ చేస్తూ మరిన్ని డబ్బులను వసూలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. అధిక లంచం ఇస్తేనే రైతుల భూముల సర్వేలు చేస్తామని హుకుం భూభారతి లో రైతులకు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని దరఖాస్తు చేసుకున్న వారు సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వద్దకు వెళితే అధిక లంచం ఇస్తేనే భూములను సర్వే చేస్తామని హుకుం జారీ చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mahabubabad: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ‘అరైవ్‌ అలైవ్‌’.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు ఇవే!

అధికంగా డబ్బులు వసూలు

సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే రైతులకు వారి చేతికి డబ్బులు వస్తాయి. అలాంటి వారి వద్ద నుంచి ముక్కు పిండి మరి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. రాత్రి అయితే చాలు మండలాధికారికి మద్యం అవసరం డాష్ డాష్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ ఇద్దరూ కూడా మండల అధికారి వీక్నెస్ కనిపెట్టి ఆయనకు రాత్రి అయితే మద్యం, మాంసం సరఫరా చేయడంతో పాటు డాష్ డాష్ ను కూడా అరేంజ్ చేస్తున్నట్లుగా పట్టణంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ మండలాధికారి సరైన దృష్టి పరిపాలనపై సారించకపోవడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లుగా కూడా చర్చ జరుగుతుంది.

సర్వేయర్, ఆర్ఐ తీరుపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం

మహబూబాబాద్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో భూములు లా అండ్ ఆర్డర్ సమస్యలకు దారి తీసే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ఉన్న కారణంగా ఆ సమస్యలను త్వరగా పరిష్కరించాలని పలుమార్లు మండల అధికారి, డివిజనల్ అధికారి లకు స్థానిక ఎమ్మెల్యే సూచించారు. వారు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్లకు ఆ సంబంధిత వ్యవసాయ భూముల సర్వేలు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ వారి మాట పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన సర్వేలు చేసుకుంటూ రైతులకు సంబంధించిన భూవివాద భూములకు సర్వేలు చేయకుండా తాత్సారం చేస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆ ఇద్దరు మండలాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కోరిన విధంగా సర్వేలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలి 

సరైన దృష్టి సారించకపోవడంతోనే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ కు హద్దు అదుపు లేకుండా పోతుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్ మండలంలో ధరణి పోర్టల్ ద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవడంతో ఆ సమస్యలన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతుంది. కానీ మహబూబాబాద్ తహసిల్దార్ కార్యాలయం మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ రైతులకు సమస్యలు పరిష్కరించకపోవడంతో పాటు ఆందోళన చెందేలా చేస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ త్వరిత గతిన పరిష్కరించడం లేదని ఆరోపణలు కూడా లేకపోలేదు. జిల్లా ఉన్నతాధికారి సరైన మార్గంలో లేకపోవడంతోనే కిందిస్థాయి అధికారులు రైతులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.

Also Read: Mahabubabad Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ తహసిల్దార్

Just In

01

Mahabubabad District: ఆ జిల్లాలో ఫంక్షన్ హాల్ అన్ని వివాదాస్పదమే.. అధికారుల మౌనం.. అక్రమాలకు కవచం?

Miracle Movie: సంక్రాంతి కానుకగా ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్ మోడ్‌లో ప్రభాస్ నిమ్మల

Forest Department: అటవీ శాఖ నిర్లక్ష్యం.. రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి!

Pawan Producer: నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను కలిసిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Megastar Comeback: ప్రసాద్ గారు ఇంట్లో మూవీ టీం సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్