Mahabubabad: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ‘అరైవ్‌ అలైవ్‌’
Mahabubabad ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ‘అరైవ్‌ అలైవ్‌’.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు ఇవే!

Mahabubabad SP: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, ఈదులపూసపల్లి గ్రామంలో ప్రారంభించి నిర్వహించిన  (Alive Arrive) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ పాల్గొన్నారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే ఆయుధం జనవరి 13 నుండి 24 వరకు జిల్లా వ్యాప్తంగా (Arrive Alive) అవగాహన కార్యక్రమాలు కొనసాగతాయని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ శివదర్ రెడ్డి నేత్రత్వంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా “Arrive Alive (అరైవ్ అలైవ్) అనే వినూతన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఘనంగా ప్రారంభమైంది. జనవరి 13 నుండి 24 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా, మొదటి రోజున మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ పాల్గొని ప్రజలకు కార్యక్రమ లక్ష్యాన్ని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ

(Arrive Alive) అనేది కేవలం ఒక నినాదంగా పరిమితం కాకుండా, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక ఉద్యమంలా ముందుకు సాగాలి. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలన్న ఆశ వారి కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగితే, ఆ కుటుంబాల బాధను ఎవరూ తీర్చలేరు. అలాంటి దుస్థితి మరెక్కడా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలి” అని అన్నారు. రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగవని, మన నిర్లక్ష్యం, అతివేగం మరియు అజాగ్రత్త వల్లే ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. హెల్మెట్ ధరించడం చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని ప్రతి వాహనదారుడు గ్రహించి తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

 Also ReadMahabubabad SP: మహిళల రక్షణ, భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయి : ఎస్పీ శబరీష్!

జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక కుటుంబాలు తమ ప్రధాన ఆదారాన్ని కోల్పోయి వీధిన పడుతున్నాయని, ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగం, అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని హెచ్చరించారు. (Safety First ) మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఇంటివద్ద ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి అని ఎస్పీ గారు ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ Arrive Alive అవగాహన కార్యక్రమాలు జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సభలలో పోలీస్ అధికారులు నిర్వహించనున్నారని, జనవరి 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తూ, బాధ్యతగా వాహనాలు నడిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్ సరవయ్య, రూరల్ ఎస్‌ఐ దీపిక, ఈదులపూసపల్లి సర్పంచ్, ఉపసర్పంచ్, ఆటో యూనియన్ సభ్యులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Also Read: Mahabubabad SP: మహిళల రక్షణ, భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయి : ఎస్పీ శబరీష్!

Just In

01

Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?

Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

Germany Good News: భారతీయులకు జర్మనీ గుడ్‌న్యూస్.. ఇకపై వీసా లేకుండానే కీలక సర్వీసు

Prabhas Emotion: ‘ది రాజాసాబ్’లో ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు.. ఏడిపించేశాడు భయ్యా

GHMC: గ్రేటర్‌లో ఈ-వేస్ట్ మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం.. ఐటీ ప్రాంతాల, ఆ షాపులపై జీహెచ్ఎంసీ ఫోకస్!