Mahabubabad Tahsildar: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసిల్దార్
Mahabubabad Tahsildar ( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Mahabubabad Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ తహసిల్దార్

Mahabubabad Tahsildar: మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో అవినీతి ‘చేప’ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న సమయంలోనే తహసిల్దార్ మహేందర్‌ (Mahender)ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  ఉదయం ఏసీబీ బృందం పెద్ద వంగర ఎమ్మార్వో కార్యాలయం వద్ద అకస్మాత్తుగా దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పోచంపల్లి గ్రామ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు నుంచి రూ.15,000 లంచం తీసుకుంటుండగా తహసిల్దార్ మహేందర్ (Mahender) ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… భూక్య స్వామి అనే రైతు ఇటీవల మరణించడంతో అతని పేరు మీద ఉన్న 3.09 ఎకరాల భూమిని తన కుమారుడు తన పేరు మీదకు మార్చుచుకోవడానికి ఎమ్మార్వో కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు.

Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!

కేసు నమోదు చేసి విచారణ

అయితే పలు రోజులుగా తహసిల్దార్ మహేందర్ ఉద్దేశపూర్వకంగా ఫైల్‌పై సంతకం చేయకుండా తిరగ్గొడుతున్నాడని బాలు ఆరోపించాడు. అంతకుముందు ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా ‘డీల్’ సెట్ చేసుకున్న తహశీల్దార్, రైతు బాలును డబ్బులు తీసుకుని నిర్ణీత సమయానికి కార్యాలయానికి రమ్మని చెప్పగా డబ్బులు తీసుకుని కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే రిజిస్ట్రేషన్ కోసం తహశీల్దార్ డ్రైవర్ గౌతమ్ కి డబ్బులు అందజేస్తుండగానే ఏసీబీ బృందం అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నారు. తదుపరి కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Tahsildar Report: ముఖ్యమంత్రి రేవంత్ చేతికి తహశీల్దార్ల రిపోర్ట్?

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు