AA23 Lokesh: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడికి ఓకే చెప్పేశారు. ‘కూలీ’ తర్వాత లోకేష్ కనగరాజ్ రెండు మూడు సార్లు అల్లు అర్జున్ ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో కనగరాజ్ తర్వాత సినిమా అల్లు అర్జున్ తో ఉండబోతుందని అందరూ ఊహించారు. తాజాగా దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్నట్లుగా తెలిపారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టకున్నారు అభిమానులు. దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఇదే ఏడాది మొదలవుతుందని ఆ వీడియోలో తెలిసారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే ఏదాదిలో పూర్తవనుంది.
Read also-Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు.. అనసూయ షాకింగ్ పోస్ట్
దీని గురించి అల్లు అర్జున్ కూడా స్పందించారు. లోకేష్ కనగరాజ్ తో పనిచేయడానకి ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాక్ అయిపోయింది. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.900 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. జవాన్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న అట్లీ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే అట్లీ సినిమా త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాది కనగరాజ్ సినిమా ప్రారంబించడానికి అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నారు.
Read also-Megastar Comeback: ప్రసాద్ గారు ఇంట్లో మూవీ టీం సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
లోకేష్ కనగరాజ్ ప్రతిష్టాత్మకంగా తీసిన రజనీ కాంత్ ‘కూలీ’ ఆశించినంత మేర ఆడలేదు. దీంతో కనగరాజ్ మళ్లీ ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ వరుసగా తమిళ దర్శకులతో ఇది రెండో సారి. ఇప్పటికే హిట్ కాంబోగా పేరుతెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, అనిరుద్ మళ్లీ ఈ సినిమాకు కలిసి పనిచేయనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక డ్యూడ్ సినిమా హిట్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రకటించారు. ఇది సినిమాకు మరింత ప్లెస్ కానుంది. ఏది ఏమైనా వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటే అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

