Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు
Anasuya (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు.. అనసూయ షాకింగ్ పోస్ట్

Anasuya: టాలీవుడ్ పాపులర్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తనపై వచ్చే విమర్శలను ధీటుగా ఎదుర్కొనే అనసూయ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన లేఖను షేర్ చేశారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ సందర్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ తన మనసులోని మాటను తెలియజేశారు. గత కొన్ని రోజులుగా అనసూయ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఈ పోస్ట్‌ (Anasuya Insta Post)లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్ చేసిన ఈ లేఖలో ఏముందంటే..

Also Read- Director Maruthi: మెగాస్టార్‌తో ఛాన్స్ వస్తే.. నా లైఫ్ సర్కిల్ ఫిల్ అయినట్లే!

భావోద్వేగానికి లోనై కన్నీళ్లు

‘‘నిన్న జరిగిన జూమ్ కాల్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నప్పుడు, అక్కడ ఉన్నవారంతా నాకు అండగా నిలవడం చూసి భావోద్వేగానికి లోనయ్యాను. అదే సమయంలో గత కొన్ని రోజులుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఈ బలహీన క్షణంలో అందరి మద్దతు చూసి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాను’’ అని అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. మహిళలు సొంతంగా తీసుకునే నిర్ణయాలలోనూ, లేదా తమ హక్కుల గురించి గొంతు ఎత్తితే, సమాజంలో ఎదురయ్యే విపరీత పరిణామాల గురించి అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఒక మహిళ తన అభిప్రాయాన్ని బలంగా చెబితే, ఆమెపై అసభ్యకరమైన దాడులు చేయడం, నీచంగా మాట్లాడటం ఈ సమాజంలో సిగ్గుచేటు. కానీ ఇలాంటి సమయంలోనూ ఎంతో మంది బలమైన మహిళలు నాకు అండగా నిలుస్తున్నారు. వారు ఇస్తున్న మద్దతే నాకు కొండంత బలాన్ని ఇస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు.

Also Read- Anaganaga Oka Raju Review: సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ ఎలా చేశాడంటే?.. ఫుల్ రివ్యూ..

నేనూ మనిషినే.. బలహీనత తప్పు కాదు

ఇంకా అనసూయ తన పోస్ట్‌లో ‘‘మేమంతా మనుషులమే. భావోద్వేగాలు ఉండటం, ఒక్కోసారి నీరసపడిపోవడం మనిషిగా సహజం. నా బలహీన క్షణాలను చూసి నేను సిగ్గుపడటం లేదు. నేను లోతుగా ఆలోచిస్తాను, స్పందిస్తాను. అయితే ఒకటి మాత్రం నిజం.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా నేను బూడిద నుంచి పుట్టిన ఫీనిక్స్ పక్షిలా మళ్ళీ పైకి లేస్తాను. నా వ్యక్తిత్వాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ అంటూ తనలోని పోరాట పటిమను చాటారు. ‘‘ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు దానిని క్యాష్ చేసుకోవాలని చూసే వారు, వారి వ్యక్తిత్వాన్నే ప్రదర్శించుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వర్గాల మీద నేను నమ్మకం కోల్పోతున్నాను. కానీ, మన దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. క్లిక్‌ బైట్ వార్తల కోసం అసత్య ప్రచారాలు చేయకండి’’ అని అనసూయ విజ్ఞప్తి చేశారు. తను ప్రెస్ మీట్‌కి రాలేకపోయినా, మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ అనసూయ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇది తన జీవితంలో ఒక గొప్ప విజయంగా భావిస్తానని చెప్పారు. చివరగా.. అందరూ శాంతి, సానుభూతి, దయతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Seethakka: మేడారం జాతరకు తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు.. పనితీరును సమీక్షిస్తూ మంత్రి సీతక్క దిశానిర్దేశం!

Mega Family: మెగా ఇంట మొదలైన సంక్రాంతి సందడి.. ‘భోగి’ స్పెషల్ వీడియో వచ్చేసింది

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’కు ఎందుకు మిక్సుడ్ టాక్ వచ్చింది.. మారుతి చేసిన తప్పు ఇదేనా?

Nidhhi Agerwal: మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది.. ‘రాజా సాబ్’పై నిధి!

AA23 Lokesh: మరో తమిళ దర్శకుడికి ఫిక్స్ అయిన అల్లు అర్జున్.. నిర్మాత ఎవరంటే?