Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా.. రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్‌గా సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తుండటంతో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వర్సటైల్ నటనతో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్‌లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి (Director Maruthi) టేకింగ్, అన్ కాంప్రమైజ్డ్‌గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) మేకింగ్.. ఇవన్నీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి మీడియాతో ముచ్చటిస్తూ… సినిమా విశేషాలను తెలిపారు.
Also Read- BB JODI Season 2: డిమోన్, రీతూ ఎంట్రీ.. బాబోయ్ అది కెమిస్ట్రీ కాదు.. !
ఏ సినిమాపై ట్రోల్స్ రాలేదో చెప్పండి
‘‘రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరూ నాకు సోదరులు. వారే ఫోన్స్, మెసేజ్‌లు చేస్తూ అభినందిస్తున్నారు. అభిమాన హీరోని కలర్ ఫుల్‌గా సాంగ్స్, డ్యాన్స్ లతో చూపించారని, కొత్తగా ప్రెజెంట్ చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా నాకు పర్సనల్‌గా విష్ చేశారు. నాగ్ అశ్విన్, సందీప్ వంగా ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అందుకే సినిమా రిలీజైన రెండో రోజే అందరి ముందుకు వచ్చాను. నాకు అనుకున్న టైమ్‌కు సినిమా రిలీజ్ చేయాలనే వర్క్స్‌లోనే టెన్షన్ పడుతూ ఉండిపోయా. అందుకే నేను రిలీజ్‌కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో అలసిపోయినట్లు కనిపించా. ఈ మధ్యకాలంలో ఏ సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ రాలేదో చెప్పండి. ప్రతి సినిమాకు వస్తుంటాయి. నలుగురు చెడుగా మాట్లాడితే.. నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు. సినిమా బాగుంది కదా అని అంటున్నారు. ప్రీమియర్ షోస్‌కు అనుమతి, బుకింగ్స్ ఇలాంటివి నా పరిధిలోకి రావు. నేను సినిమాను ఇన్ టైమ్ రిలీజ్‌కు రెడీ చేసే పనిలోనే నిమగ్నమయ్యాను.
Also Read- Anil Ravipudi: మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు
మెగాస్టార్‌కు వీరాభిమానిని
రాజా సాబ్ సినిమాకు ఇంత భారీ కలెక్షన్స్ వస్తున్నాయంటే ప్రభాస్‌ని కొత్త జానర్‌లో అంతా ఒప్పుకున్నట్టే కదా. బీ, సీ సెంటర్స్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ పాత్రపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంచాలనే ఇంట్రో సీన్ నుంచి ప్రయత్నించాం. క్లైమాక్స్‌లో కూడా వందమందిని పెట్టి ఫైట్ చేయించవచ్చు. అలా చేస్తే మళ్లీ రొటీన్ అని అంటారు. నేను ఒక పెద్ద స్టార్‌తో కూడా సినిమా బాగా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాను. సీజీ వర్క్స్ విషయంలో కొన్ని నేర్చుకున్నాను. ‘ప్రతిరోజు పండగే’ సినిమాను 40 రోజుల్లో రాసిన నేను… ‘రాజా సాబ్’లోని కొన్ని సీన్స్ కోసమే రెండు నెలల టైమ్ తీసుకున్నా. అలా రాజా సాబ్ సినిమా నాకు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమానే నా ఆలోచనల్లో నిండి ఉంది. నెక్ట్స్ సినిమా మెగాస్టార్‌తో అని అంతా అనుకుంటున్నారు. నిజంగా మెగాస్టార్ (Megastar Chiranjeevi)తో సినిమా చేసే అవకాశం వస్తే నా లైఫ్ సర్కిల్ ఫిల్ అయినట్లుగా భావిస్తా. ఎందుకంటే ఆయనకు వీరాభిమానిని నేను. ప్రస్తుతం ప్రేక్షకులు ‘రాజా సాబ్’ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ప్రశాంతంగా నా ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నా. అందరికీ హ్యాపీ సంక్రాంతి’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

