Anil Ravipudi: మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు
Anil Ravipudi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anil Ravipudi: మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఈ సంక్రాంతికి వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందురోజు పడిన ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం, మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోన్న నేపథ్యంలో మేకర్స్ ప్రేక్షకుల, మీడియాకు మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ (Mega Blockbuster Thank You Meet) నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు.

అవన్నీ కలుపుకుంటూ వెళ్లా..

ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్‌గా చేసిన గ్లోబల్‌గా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ సో మచ్. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలు తీసి.. మీకు ఆనందాన్ని ఇచ్చి దాని ద్వారానే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా కెరీర్‌లో చాలా ఫాస్ట్‌గా రాసుకున్న స్క్రిప్ట్ ఇదే. మినిమమ్ రెండు నెలలు నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తాను. డైలాగ్స్‌తో సహా అయితే 3 నుంచి మూడున్నర నెలలు పడుతుంది. కానీ, ఈ సినిమాకు కేవలం 25 రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేశాను. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. కాసేపు చిరంజీవి గారు అనకుండా సగటు ప్రేక్షకులు మెగాస్టార్‌ని ఎలా అభిమానిస్తారో అనుకుంటే.. డైలాగులు చాలా కూల్‌గా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది.. చిరంజీవి. కంటి నుంచి నీళ్లు బయటికి రాకుండా మనందరినీ ఏడిపించాలంటే… చిరంజీవి, డ్యాన్స్‌ని గ్రేస్ ఫుల్‌గా చేయాలంటే.. చిరంజీవి, వందమంది ఫైటర్స్ ఎదురుగా నిలబడితే ఒక యాటిట్యూడ్‌తో సిగరెట్ వెలిగించి బాసిజం చూపించాలంటే.. చిరంజీవి.. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా తన మార్క్ స్టైల్‌తో మనందరికీ ప్రజెంట్ చేసింది చిరంజీవి. అలాంటి చిరంజీవికి కథ రాస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకతలు అన్నిటిని కలుపుకుంటూ వెళ్లిపోయాను. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎలా అలరించారో అవన్నీ కలుపుకుంటూ వెళ్లాను. అందుకే స్క్రిప్టు అంత ఫాస్ట్‌గా ఫినిష్ అయ్యింది.

Also Read- Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?

క్రెడిట్ మొత్తం మెగాస్టార్‌కే..

ఇందులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ మెగాస్టారే. అందుకే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు, మెగాస్టార్‌ని ఒక నటుడిగా అభిమానించే ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన ఈ సినిమాలో అడుగడుగునా ఒక మ్యాజిక్‌ని క్రియేట్ చేసే అవకాశం నాకు కల్పించారు. అభిమానులు చూపిస్తున్న, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. కొంతమంది మెగా ఫ్యాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని కూడా చూశారు. అంత అభిమానం చూపిస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్న ఈ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా కుదిరింది అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. 150 సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఒక లెజెండరీ హీరో. మేమందరం కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం.. అలాంటిది నేను ఒక కథ అనుకుని ఒక టైమింగ్ అనుకొని ఆయన దగ్గరికి వెళ్తే.. ఆయన కూడా మా అందరితో కలిసిపోయి ఒక నార్మల్ మనిషి లాగా అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ, ఆయన అనుభవాన్ని మాతో పంచుకుంటూ మా అందరినీ నడిపించిన శంకరుడు మా చిరంజీవి. ఆయనతో పనిచేసిన 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ. ఆయన గురించి ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉంది. అది సక్సెస్ మీట్‌లో చెప్తాను.

Also Read- Director Maruthi: ‘ది రాజా సాబ్’ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నాకు ముందే తెలుసు!

దొరుకుతాడా దొరకడా.. దొరికేశాను

ఈ సినిమాకు నిర్మాతలుగా చేసిన సాహు నా ఫ్రెండ్. తను, తనకి ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఒకేలా ఉంటాడు. ఇంత పెద్ద బడ్జెట్‌ని, ఇంత స్టార్ కాస్ట్ ఇచ్చి సినిమాని ఒక అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్ సుస్మిత. నేను ప్రతి సినిమా సక్సెస్‌కి జోన్ అవుట్‌లో ఉంటా. ఇంతపెద్ద సక్సెస్ కొట్టానా అనే జోన్ అవుట్‌లో ఉంటా. సుస్మిత కూడా అలాంటి జోన్ అవుట్‌లో కనిపించారు. మెగాస్టార్ చేసే ఒక అద్భుతమైన ప్రాజెక్టులో తన పేరు ఉండాలని కలలు కన్న సుస్మితకు, ఆ డ్రీమ్ నెరవేరినందుకు కంగ్రాట్యులేషన్స్. తను ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి వసూళ్లపరంగా ఇద్దరు నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, నటీనటులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఇందులో చిరు నయనతారల జోడి అద్భుతంగా కుదిరింది. మా విక్టరీ వెంకటేష్ మాతో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రావెల్ అయ్యారు. ఒక అద్భుతమైన కామియో రోల్ చేశారు. థియేటర్స్‌లో ఆడియన్స్ ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు స్టార్స్ ఒకళ్ళపాటకి ఒకళ్లు డాన్స్ చేయడం థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాత్రని ఒప్పుకున్నందుకు విక్టరీ వెంకటేష్ సార్‌కి హాట్సాఫ్. ఈ సక్సెస్‌లో ఆయనది కూడా చాలా పెద్ద భాగం ఉంది. మీడియా మిత్రులందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీలను మర్చిపోలేను. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలుది కాదు. దొరుకుతాడా దొరకడా అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రేక్షకులకు గట్టిగా దొరికేశాను. టికెట్ పెట్టి మెగాస్టార్‌ని మేము ఇలా చూడాలి.. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చూస్తున్న ప్రేక్షకులందరికీ గట్టిగా దొరికాను. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రేమ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంక్రాంతి కూడా నాకు మెమరబుల్‌గా చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!

Damodar Raja Narasimha: ఉగాది నాటికి టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తాం.. మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం!

Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాభివ్రుద్ధికి కృషి చేస్తా.. బండి సంజయ్ కుమార్ హామీ!

Seethakka: మేడారం జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి.. అధికారులకు సీతక్క కీలక సూచనలు!

BB JODI Season 2: డిమోన్, రీతూ ఎంట్రీ.. బాబోయ్ అది కెమిస్ట్రీ కాదు.. !