Director Maruthi: సంక్రాంతి పండుగ స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా నటించిన ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్‌గా సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తుండటంతో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వర్సటైల్ నటనతో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్‌లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి (Director Maruthi) టేకింగ్, అన్ కాంప్రమైజ్డ్‌గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) మేకింగ్.. ఇవన్నీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి మీడియా ద్వారా తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ..
Also Read- Anaganaga Oka Raju: గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్.. హిలేరియస్‌గా ఉంటుందట!
కొంత టైమ్ పడుతుందని ముందే తెలుసు
‘‘ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేసినందుకు మరింత హ్యాపీగా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద ఇంత హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోందని నమ్ముతున్నాను. ఈ సంక్రాంతి హాలీడేస్‌లో మరింతగా మా మూవీకి ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో కొత్త పాయింట్‌ని ఇందులో చూపించాం. అందుకే ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నాం. ప్రభాస్ కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం. కొంత టైమ్ పడుతుంది ఆడియెన్స్‌కు చేరడానికి అని చెప్పారు. రీసెంట్‌గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్‌గా సెట్ అయ్యాయని చెప్పారు. ప్రేక్షకులంతా ఇప్పుడు సంక్రాంతి మూడ్‌లో ఉంటారు కాబట్టి.. ఒక లైటర్ వేన్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఈ కథలో బొమన్ ఇరానీ పాత్ర ఎంటరైనప్పటి నుంచి సైకలాజికల్‌గా టర్న్ అవుతుంది. ఆ సీన్స్ వెనక మేము అనుకున్న కాన్సెప్ట్ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చని అనుకుంటున్నాను.
Also Read- Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?
సెకండ్ టైమ్ మూవీ చూస్తే..
హారర్ మూవీస్‌లో దెయ్యాన్ని చంపడం ఈజీ. ఎలాగైనా చంపొచ్చు. కానీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి, సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ మూవీ చేశాం. సినిమా రిలీజైన సెకండ్ డే ప్రెస్ మీట్‌లో నేను మా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది క్లియర్‌గా చెప్పాను. ఈ సోషల్ మీడియా ట్రెండ్‌లో ఏదీ దాగదు. ఇప్పుడు ‘రాజా సాబ్’ మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుందంటూ వాళ్లే మెసేజ్‌లు పంపుతున్నారు. మీరు ఫస్ట్ టైమ్ మూవీ చూసినప్పుడు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ వెతుక్కుంటారు. కానీ సెకండ్ టైమ్ మూవీ చూస్తే ఎంత డెప్త్‌గా ఆలోచించి ఈ సీన్ చేశామనేది అర్థమవుతుంది. ఇలాంటి సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్‌లోకి వెళ్లాడనేది విజువల్‌గా చూపించడం కష్టం. అతని సబ్ కాన్షియస్ మైండ్‌ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. ఈ మూవీలోని ఓల్డ్ గెటప్‌లో రివర్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. కొన్ని సీన్స్ కోసం ప్రభాస్ 15 డేస్ ఎలా చేద్దామని ఆలోచించారు. నువ్వు ఇంత గ్రేట్ సీన్ రాశావు డార్లింగ్, నేనూ నా వందశాతం ఎఫర్ట్స్ పెట్టాలి కదా అని ఆయన అనేవారు. జోకర్ సీన్‌లో ఆయన చిన్న స్మైల్ ఇస్తారు. ఆ స్మైల్‌తో గ్రేట్ పెర్ఫార్మ్ చేశారనిపించింది’’ అని మారుతి చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

