Anaganaga Oka Raju: స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషనల్ కంటెంట్‌తోనే అందరినీ అలరించిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం గ్రాండ్‌గా నిర్వహించిన మేకర్స్, మంగళవారం మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
Also Read- Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?
ప్రీ సేల్స్‌తోనే
ఈ కార్యక్రమంలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగువారికి సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని హ్యాపీగా ఫెస్టివల్‌ను జరుపుకుంటాం. ఎంత ఒత్తిడి ఉన్నా పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే ఈ ‘అనగనగా ఒక రాజు’లో అంతా చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్‌ని ఆదరించి.. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశారు. ట్రైలర్‌లో ఉన్న జోక్స్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంది, చాలా చాలా బాగుంది అంటూ… అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే బుకింగ్స్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే ప్రీ సేల్స్‌తోనే నా గత చిత్రాల ఓపెనింగ్స్‌ని దాటేసింది. ప్రేక్షకులు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. అలరించేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.
Also Read- Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి
పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్
హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మాట్లాడుతూ.. మేమందరం ఎంతో కష్టపడి పని చేసి.. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాతో ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అని తెలిపారు. దర్శకుడు మారి మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ ఇది. సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండుగే కాదు, ఒక ఎమోషన్ కూడా. సంక్రాంతి కానుకగా మా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా రాజు గారితో ఈ పండగను ఎంజాయ్ చేయండని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమాను నిర్మించాం. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో హిలేరియస్‌గా ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పర్ఫెక్ట్ ఫెస్టివల్ సినిమా ఇదని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

