Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, కలెక్షన్ల సునామీతో భారత సినీ పరిశ్రమను షేక్ చేసిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule). ఇప్పుడీ చిత్రం జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే ఓ సెన్సేషనల్‌గా మారి.. ఇండియన్ సినీ బాక్సాపీస్ దగ్గర తిరుగులేని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జపాన్‌కు సంబంధించి ఓ స్పెషల్ రెఫరెన్స్ సన్నివేశం కూడా ఉందనే విషయం తెలియంది కాదు. పుష్పరాజ్ ఎంట్రీ ఫైట్ సీన్ జపాన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ స్వయంగా జపనీస్‌లో డైలాగ్స్ పలికి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల్లో ‘పుష్ప 2’పై మరింత ఆసక్తిని పెంచతున్నాయి.
Also Read- Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి
టోక్యోలో ఐకాన్ స్టార్
‘పుష్ప 2: ది రూల్’ చిత్రాన్ని జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin)గా జనవరి 16న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. సినిమాను ప్రమోట్ చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి టోక్యో చేరుకున్నారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అందమైన నగరం ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. దీనికి సింపుల్‌గా టోక్యో అనే క్యాప్షన్ పెట్టారు. గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘పుష్ప కున్రిన్’ను జపాన్ సిల్వర్ స్క్రీన్స్ మీదకు తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే జపాన్ ప్రేక్షకులు ఇండియన్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను ఎంతగానో ఆదరించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప కున్రిన్’ కూడా ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు.
Also Read- People Media Factory: ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’పై మెగా దెబ్బ.. మొన్న పవన్, ఇప్పుడు చిరు!
‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసి, తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో విడుదలై, అక్కడ కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అల్లు ఆర్మీ కూడా ఆశపడుతోంది. ఈ చిత్రం 15 జనవరి, 2026న జపాన్ థియేటర్లలో ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోలీస్ అధికారిగా కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. త్వరలో ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉంటుందని ఇటీవల నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

