People Media Factory: టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు నిర్మించే బ్యానర్ ఏదైనా ఉందంటే అది ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media Factory) మాత్రమే. వంద సినిమాల టార్గెట్‌తో దూసుకుపోతున్న ఈ సంస్థకు ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక సినిమా కాదు, రెండు సినిమాలు కాదు.. వరుసగా ఈ బ్యానర్ నుంచి వస్తున్న భారీ ప్రాజెక్టుల కలెక్షన్లకు మెగా హీరోలు బ్రేకులు వేస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఇలా వరుసగా మెగా దెబ్బకు ఈ ప్రొడక్షన్ హౌస్ విలవిలలాడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
‘మిరాయ్’ ఆశలపై ‘ఓజీ’ నీళ్లు..
సూపర్ యోధగా తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ (Mirai) సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఆశలే పెట్టుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ కూడా నమోదయ్యాయి. కానీ, సరిగ్గా అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’ (OG) థియేటర్లలోకి వచ్చింది. పవన్ క్రేజ్ ముందు ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ ఒక్కసారిగా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం థియేటర్లను ఖాళీ చేయాల్సి రావడం, ఆడియన్స్ ఫోకస్ మొత్తం ‘ఓజీ’ వైపు వెళ్లడంతో.. ‘మిరాయ్’ అద్భుతమైన టాక్ తెచ్చుకున్నా కానీ, మేకర్స్ ఊహించిన లాభాలను మాత్రం రాబట్టలేకపోయింది.
Also Read- Kishore Tirumala: ‘బి.ఎమ్.డబ్ల్యూ’లో ఆ ప్రశ్నే ఇంపార్టెంట్.. విడాకులకు కారణమదే!
‘రాజా సాబ్’పై శంకర్ ప్రసాద్ ఎఫెక్ట్
ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టుగా మొదటి రోజే ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్‌ను బీట్ చేసి రికార్డులు సృష్టించింది. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడం ఒక మైనస్ అయితే, సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో రంగంలోకి దిగడం పీపుల్ మీడియాకు పెద్ద దెబ్బగా మారింది. చిరంజీవి సినిమాకు క్లీన్ పాజిటివ్ టాక్ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చిరు జపం చేస్తుండటంతో.. ‘రాజా సాబ్’ కలెక్షన్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘రాజా సాబ్’ సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే లాంగ్ రన్ ఉండాలి, కానీ మెగాస్టార్ సినిమా జోరు ముందు ప్రభాస్ సినిమాకు థియేటర్లు, షేర్స్ తగ్గడం ఈ బ్యానర్‌కు మింగుడుపడని విషయమనే చెప్పుకోవాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ తన బ్యానర్‌ను టాప్ రేంజ్‌లో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నా, మెగా హీరోల సినిమాల క్లాష్ వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తోంది. మొన్న పవన్, ఇప్పుడు చిరు సినిమాలు తమ సినిమాలపై ఎఫెక్ట్ చూపడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉందనేలా ట్రేడ్‌లోనూ టాక్ నడుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

