Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ టికెట్ల ధర పెంపుపై ఫైర్
Anaganaga Oka Raju (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Anaganaga Oka Raju: ప్రస్తుతం ఏపీలో సినీ నిర్మాతలకు స్వర్ణయుగం నడుస్తుంది. అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే (Deputy CM Pawan Kalyan). ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం దగ్గర నుంచి బెనిఫిట్ షో వరకు ఈజీగా అనుమతులు వచ్చేస్తున్నాయి. దీన్ని నిర్మాతలు బాగా వాడుకుంటున్నారు. అయితే ఇది స్టార్ హీరోల చిత్రాల వరకు ఉంటే పర్లేదు కానీ, నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) చిత్రానికి కూడా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించడంతో.. దీన్నో విడ్డూరంగా అంతా చూస్తున్నారు. వాస్తవానికి ‘కూలీ’, ‘వార్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలకు కూడా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటుని కల్పించారు. మరి స్ట్రయిట్ ఫిల్మ్ అయిన ‘అనగనగా ఒక రాజు’కు ఇస్తే తప్పేంటి అని అంతా ప్రశ్నించవచ్చు.

నవీన్ పొలిశెట్టి సినిమాకు అవసరమా?

ప్రస్తుతం జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించారని నిర్మాతలే అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే ప్రయత్నం చేయాలి కానీ, ఇలా టికెట్ల ధరలను పెంచుకుంటూ (Tickets Price Hike) పోతే ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరోలంటే సరే సరి. వారి సినిమాలకు భారీగా బడ్జెట్ అవుతుంది కాబట్టి, పెంచిన పరవాలేదని అనుకోవచ్చు. కానీ, నవీన్ పొలిశెట్టిని చూసి, పెరిగిన ధరలతో సినిమా చూడాలని ఎవరైనా అనుకుంటారా? నవీన్ పొలిశెట్టి అంటే ఇష్టపడతారు కానీ, అంత అమౌంట్ పెట్టి సినిమాలకు అయితే రారు అనేది నెటిజన్ల వాదన. అందులోనూ పోటీగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలకు అదే రేటు ఉన్నప్పుడు ఆ సినిమా చూడడానికి ఇష్టపడతారు కానీ, నవీన్ సినిమాకు జనాలు వస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Also Read- Sharwanand: ‘శతమానం భవతి’.. ఆత్రేయపురంలో ‘నారీ నారీ నడుమ మురారి’!

ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయట్లేదు

కొందరైతే నవీన్‌కు డైరెక్ట్‌గా మెన్షన్ చేస్తూ.. ‘నవీన్ బ్రో.. ఎందుకు హైక్స్? నీ మూవీ తక్కువ ఉంటే వెళ్దాం అనుకున్నాం. అవసరం లేదు.. మేమేం వెళ్లం’ అని కొందరు నెటిజన్లు అంటుంటే.. ‘సినిమా అనేది అంత అవసరమైనది కాదు.. జస్ట్ ఇగ్నోర్ చేయండి. వాళ్లే బిజినెస్ లేకపోతే హైక్స్ ఆపేస్తారు. ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయట్లేదు. అంతా మన ఇష్టం’ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది. అయినా ప్రభుత్వం ఇస్తుంది కదా అని, చేసిన ప్రతి సినిమాకు ధరలు పెంచమని అడగడం ఏమంత కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కానీ, మరీ ఇలా ప్రతి దానికి వాడుకోవాలని చూస్తే, అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందనేలా సినీ పండితులు కూడా వార్న్ చేస్తున్నారు.

Also Read- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ వివరాలివే..

నిర్మాతలు కాస్త చూసుకోండయ్యా..

అయినా.. మంచి కంటెంట్‌తో, పండగ బరిలో దిగితే నవీన్ పొలిశెట్టి ఈజీగా హిట్ కొట్టేస్తాడు. అంత స్టామినా ఆయనకు ఉంది. దానిని వదిలేసి, హైక్స్ అని ఊరేగడం మాత్రం ఏమంత కరెక్ట్ కాదనే చెప్పుకోవాలి. ప్రభుత్వానిదేముంది.. హైక్స్ ఇస్తే వాళ్లకి కూడా డబ్బులు వస్తాయి. అందులో, ఆ సినిమాలకు ఇచ్చారు, ఈ సినిమాలకు ఇవ్వలేదు అనే నింద తమపై పడకుండా వాళ్లు తీసుకునే జాగ్రత్తలు వారు తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి, నిర్మాతలు ఈ విషయంలో కాస్త క్లారిటీ వ్యవహరిస్తే బాగుంటుంది. అది మ్యాటర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Prabhas: ప్రభాస్.. ఈ కటౌట్‌ని వాడుకోలేకపోయిన డైరెక్టర్స్ వీరే..!

People Media Factory: ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’పై మెగా దెబ్బ.. మొన్న పవన్, ఇప్పుడు చిరు!

Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Nenu Ready Teaser: 30 వేల జీతానికి ఇలాంటి దరిద్రపుగొట్టు జాబ్ ఎవడైనా చేస్తాడా?

Bhatti Vikramarka: వారికి గుడ్ న్యూస్.. జంట పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!