Manchu Manoj: సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ డిటైల్స్
Manchu Manoj (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ వివరాలివే..

Manchu Manoj: సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల కోసం రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ (Rocking Star Manchu Manoj) న‌టించిన బ్రాండ్ ఫిల్మ్‌ను జీ 5 ఆవిష్క‌రించింది. ఈ బ్రాండ్ ఫిల్మ్‌లో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే జీ5 హామీ మ‌రింత ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. ‘మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5’ (Mana Pandaga, Mana Entertainment, Mana Telugu ZEE5) అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ సంబరాల క్యాంపెయిన్.. ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది. సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లుగా ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.

Also Read- Allu Aravind: ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’పై మాస్టర్ మైండ్ స్పందనిదే..

మనోజ్‌తో గ్రాండ్ ఫిల్మ్

సంక్రాంతి స్పెషల్‌గా రూపొందించిన సంప్ర‌దాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్.. పండుగ సమయంలో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఉండే అనురాగం, ఆత్మీయ‌త‌, సునిశిత‌మైన హాస్యాన్ని ఆవిష్క‌రిస్తోంది. ఇందులోని క‌థ‌ను గ‌మ‌నిస్తే.. రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ త‌న గ్రామానికి బ‌స్సులో ప్ర‌యాణాన్ని ప్రారంభినట్లుగా చూపించారు. మ‌ధ్య‌లో మ‌న‌కు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన హాస్య‌భ‌రిత‌మైన సంద‌ర్భాలు, స‌ర‌దాగా సాగిన చ‌ర్చ‌లను ప‌రిచ‌యం చేయనున్నారని తెలుస్తోంది. కథ చివరలో ఎన‌ర్జిటిక్ సెల‌బ్రేష‌న్స్‌ను ప్లాన్ చేశారు. ఇదంతా చూపించ‌టం ద్వారా జీ 5 ఈ ఏడాదంతా తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేసేందుకు అని జీ 5 టీమ్ చెబుతోంది. ఈ బ్రాండ్ ఫిల్మ్‌కు సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘లిటిల్ హార్ట్స్‌’ చిత్రానికి వర్క్ చేసిన సూర్య బాలాజీ కెమెరామెన్‌గా వ‌ర్క్ చేశారు. ఇది పండుగ స్మృతుల‌ను, ఆధునికమైన ప‌ద్ధ‌తిలో చెప్పేలా దీన్ని రూపొందించారు.

Also Read- Chiranjeevi Comeback: మెగాస్టార్ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న సీనియర్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే?

ఆ పాత్రలన్నీ గుర్తొచ్చాయి

రాబోయే రోజుల్లో జీ5 మ‌రింత‌గా ప్రేక్ష‌క ఆద‌ర‌ణ పొందేలా సినిమాల‌ను అందించ‌నుందనే విషయం ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిన విషయం తెలియంది కాదు. తాజాగా నేడు థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టించిన ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’, ర‌వితేజ హీరోగా న‌టించిన ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’, ‘గుర్రం పాపిరెడ్డి’ వంటి సినిమాలు జీ5లో వచ్చేందుకు క్యూలో ఉన్నాయి. ఇలాంటి చిత్రాల‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టంలో త‌న స్థానాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకుంటోంది జీ 5. ఈ సంద‌ర్బంగా తెలుగు జీ 5, బిజినెస్ హెడ్ అనురాధ గురు మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని, వైవిధ్య‌మైన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌ట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం మేము ముందుకు వెళుతున్నాం. సంప్ర‌దాయ కుటుంబ క‌థ‌ల నుంచి పండుగ థీమ్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్స్‌, ఆస‌క్తిని రేకెత్తించే థ్రిల్ల‌ర్స్‌, స్టార్ హీరోల‌కు సంబంధించిన బ‌డా ప్రాజెక్ట్స్ ఇలా అన్నీ ర‌కాల కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నామని, ఈ సంక్రాంతి క్యాంపెయిన్ జీ 5 విలువ‌ల‌ను ప్ర‌తిబింబిస్తోందని తెలిపారు. మంచు మ‌నోజ్ మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే కుటుంబం. నేను ఇది వ‌ర‌కు ఫన్నీగా, స‌ర‌దాగా న‌వ్వుకునేలా చేసిన పాత్ర‌ల‌న్నీ ఇందులో భాగమవడంతో మరోసారి గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఫీలింగ్‌ను పొంద‌టం నిజంగా చాలా కొత్త‌గా ఉంది. పండుగ వాతావ‌ర‌ణాన్ని ఇందులో చాలా స‌హ‌జంగా చిత్రీక‌రించారు. ఇలాంటి క్యాంపెయిన్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kishore Tirumala: ‘బి.ఎమ్.డబ్ల్యూ’లో ఆ ప్రశ్నే ఇంపార్టెంట్.. విడాకులకు కారణమదే!

Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం విఫలమైంది.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Nayanthara: ఒక సామ్రాజ్యమే.. నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..

Huzurabad: ఆ జిల్లా కార్మిక శాఖలో ప్రైవేట్ రాజ్యం.. ప్రభుత్వ కార్యాలయమా? లేక ప్రైవేట్ వ్యక్తుల దందా కేంద్రమా?

KTR fires on BRS: జిల్లాల పునర్విభజనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు