Allu Aravind: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమా నేడు గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు రోజే పడిన ప్రీమియర్స్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో చిత్రయూనిట్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కూడా ఈ సినిమా సక్సెస్‌పై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై, మెగాస్టార్ చిరంజీవిపై, దర్శకుడు అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వింటేజ్ చిరుని మళ్లీ తీసుకువచ్చినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మాస్టర్ మైండ్ అల్లు అరవింద్.. మళ్లీ పాత చిరంజీవిని చూసినట్లుగా ఉందంటూ ఎగ్జైట్ అయ్యారు.
Also Read- Chiranjeevi Comeback: మెగాస్టార్ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న సీనియర్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే?
బాస్ ఈజ్ బాస్
సినిమా చూసిన అనంతరం అల్లు అరవింద్ (Allu Aravind) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసి వస్తుంటే నాకు మాములు ఎగ్జైట్‌మెంట్ లేదు. బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్. మళ్లీ ఆ ఓల్డ్ రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు సినిమాలు చూసిన ఎగ్జైట్‌మెంట్ మళ్లీ వస్తుంది. సూపర్ నోస్టాల్జియా. సూపర్ హిట్ ఫిల్మ్. బాస్ ఈజ్ బాస్ అనిపించాడు.. ఎక్స్‌లెంట్. డ్యాన్సుల్లో కూడా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా వింటేజ్ తీసుకొచ్చేసరికి, డైరెక్టర్ చాలా గొప్పగా ఆలోచించాడని అనిపించింది. వెంకటేష్ ఎంట్రీ, కాంబినేషన్, క్లైమాక్స్ అన్నీ అదిరిపోయాయ్. సినిమా ఎక్స్‌లెంట్. ప్రేక్షకులకు పైసా వసూల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌తో బయటకు వస్తారు’’ అని చెప్పుకొచ్చారు. దాదాపు అందరూ ఇదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా 90స్ బ్యాచ్ అయితే.. తమ బాల్యంలో చూసిన మెగాస్టార్ మళ్లీ కనిపించినందుకు ఫుల్‌గా ఛిల్ అవుతున్నారు.
ఒంటి చేత్తో..
సినిమాపై ఉన్న నమ్మకంతో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ విషయంలో మెగాస్టార్‌ని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఒక్క ప్రీ రిలీజ్ వేడుకకు మాత్రమే ఆయన అటెండ్ అయ్యారు. ఈసారి మీడియాకు కూడా ఆయన ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. పండుగ స్పెషల్ ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. మెగాస్టార్ కుమార్తె, ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించిన సుస్మిత కొణిదెల మాత్రం మరో నిర్మాత సాహు గారపాటితో కలిసి చాలా వేడుకలకు హాజరయ్యారు. అనిల్ రావిపూడి కూడా ప్రమోషన్స్ మొత్తం తనపైనే వేసుకున్నారు. నయనతార కూడా ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పినా, ఆ మాటే చాలంటూ అనిల్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫైనల్‌గా సినిమాపై ఇంత నమ్మకం ఉంది కాబట్టే.. ఆయన ఒక్కడే ముందుండి అన్నీ నడిపించారు. ఆయన నమ్మకం నిజమై.. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

